
HAPPY BIRTHDAY
సంగీతం మనస్సుకి పారవశ్యాన్ని సమర్పిస్తుంది అమ్మలా లాలిపాట వినిపిస్తుంది ఆత్మీయుడిలా ఆదరిస్తుంది చల్లని నీడలా సేదతీరుస్తుంది నేస్తంలా అండగా నిలబడుతుంది సంగీతం రాగాల వనంలో చిగురించిన కుసుమైతే పరిమళ స్పర్శలా స్వరం మనకి ఆస్వాగతం కలిగిస్తుంది నేపధ్య సంగీతం బాగా ప్రచారం కావడానికి ఎందరో మహనీయులు సంగీత ప్రజ్ఞ కలిగిన గాయక గాయనీమణులు అందరూ దోహదపడ్డారు పాతతరం ఘంటసాల ఘంటసాల నిన్నటి బాలు గారి నుంచి నేటి ఉదిత్ నారాయణ వరకు తమ సుస్వారాన్ని సరిగమల చెంత గానసాహచర్యాన్ని సమర్పించిన ఎస్.జానకి (శిష్ట్లా జానకమ్మ) జన్మదినం గురువారం (23-04-1938). ఒక్కసారి పాటల తెర తెరిచినప్పుడు మాధుర్య గీతాలు స్మరణకు వస్తాయి. పసిపాప గొంతులా, ఒక్కొక్కసారి అతివ ఆవేదనని ఆర్ద్రతని భావయుక్తంగా వినిపించారు పాటల ప్రపంచంలో మనం అందరం తన్మయత్వంగా తరిస్తాం ఇప్పటికీ ఆ పాటలు విన్నప్పుడు హృదయం పులకరించి లో నుండి సరిగమల తలుపులు తెరిచిన రాగాల ప్రపంచానికి స్వాగతిస్తాం సిరిమల్లె పువ్వు సోయగాలని కన్నెమనసు అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఏ లీల పాడెద దేవా అంటూ వాయిద్యాల సవ్వడిని విచిత్రంగా వినిపించారు.
వెన్నెలలో గోదారి అందాలని వేదనగా అలపించినప్పుడు సితార మెరిసింది. నెమలికి నేర్పిన నడకలు అని రాగయుక్తంగా పాడినప్పుడు మురిసిపోయారు మరుగేలరా రాఘవ అని ఆర్ద్రతగా అన్నప్పుడు రామయ్య పదం మనల్ని చేరింది. పడమటి సంధ్యారాగంలో అన్నమయ్య భావసంకీర్తనలకు సుగంధ స్వర స్పర్శని అందించారు. ఆకాశంలో హరివిల్లుని అందంగా స్వర్ణకమలంలో అలంకరించారు మనసు గాయపడిన అధ్యాపకురాలి ఆవేదన నివేదనల్ని ప్రతిఘటనలో స్వరంలో భావోద్వేగంగా దుర్యోధన పాట ద్వారా తెరమీద అందించారు మౌన పోరాటానికి సంగీత దర్శకత్వ సారథ్యం చేశారు. ఇళయరాజా ,చక్రవర్తి కేవీ మహదేవన్, ఇలా ఎందరో సంగీత దర్శకుల ఖ్యాతికి జానకమ్మ ప్రతిభ నీడగా ఉంది. బాలు జానకి సుశీల 1970 -2000 సంవత్సరాల మధ్య స్వర త్రివేణి సంగమమై తెరమీద ప్రవహించారు. ఆ జానకమ్మకు హృదయపూర్వకమైన రాగయుక్త శుభాకాంక్షలు.
— డాక్టర్ దువ్వూరి శర్మ, సినీ పరిశోధకులు , 99490 39175





