రెచ్చిపోయిన సన్ రైజర్స్


ఐపీఎల్ ఏప్రిల్ 29 మ్యాచ్: ఐపీఎల్ లో ఇప్పటికే సగానికి పైగా లీగ్ మ్యాచ్ లు జరిగాయి. మొదట్లో తడబడిన సీన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (ఎస్సార్ హెచ్) ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ఏప్రిల్ 29 బుధవారం నాడు ముంబైలో ముంబై ఇండియన్స్ కు (ఎం.ఐ) మధ్య జరిగిన మ్యాచ్ లో నెగ్గి హైదరాబాద్ జట్టు వరసగా అయిదో విజయం నమోదు చేసుకుంది. ముంబై ఓటములతో కునారిల్లుతోంది. ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోయింది. ఈమధ్య జరిగిన కొన్ని మ్యాచ్ లను గమనిస్తే… ఒక టీమ్ లో ఎవరైనా సెంచరీ కొడితే ఆ టీం ఓడిపోతోంది. ఆమధ్య వైభవ్ సూర్యవంశీ, నిన్న రికెల్టన్ చేసిన శతకం వృథా అయ్యాయి. ఎం.ఐ. బ్యాటర్ రికెల్టన్ 123 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. కానీ టీం యథాప్రకారం ఓడిపోయింది.
ముంబై ఇన్నింగ్స్: బ్యాటింగ్:
విల్ జాక్స్ _ రికెల్టన్ (నాటౌట్) ఓపెనర్స్. జాక్స్ 46, నమన్ ధీర్ 23, హార్దిక్ పాండ్య 31రన్స్ చేశారు. స్కోర్: 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 రన్స్.
బౌలింగ్: బౌల్ట్ 1, గుజరాత్ ఫర్ 2, హార్దిక్ పాండ్య ఒక వికెట్ తీసుకున్నారు. బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. అతను ఫాంలో లేడనిపిస్తుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్:
బ్యాటింగ్ లో హెడ్, క్లాసెన్, అభిషేక్ రెచ్చిపోయారు. అభిషేక్ 45, హెడ్ 78, క్లాసెన్ 65 (నాటౌట్) , నితీష్ కుమార్ రెడ్డి 21 రన్స్ చేశారు. స్కోర్: 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249.
బౌలింగ్: ప్రఫుల్ సింగే 2, ఇషాన్ మలింగ 1, సకీబ్ 1, నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ తీశారు.
సన్ రైజర్స్ ఇంతవరకూ 9 మ్యాచ్ లు ఆడింది. 6 గెలిచింది. 3 ఓడింది. 3వ ప్లేస్ లో ఉంది.
ముంబై ఇంతవరకూ 8 మ్యాచ్ లు ఆడింది. 2 మాత్రమే నెగ్గింది. 6 ఓడింది. 9వ ప్లేస్ లో ఉంది.
-వి. మధుసూదనరావు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *