చెన్నై ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు


చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో విజయం

     క్నోలోని ఏకనా స్టేడియంలో  శుక్రవారం జరిగిన లక్నో సూపర్ జెయింట్స్  , చెన్నై సూపర్ కింగ్స్  మ్యాచ్‌లో  లక్నో  జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. .చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు: నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ ( 42 బంతుల్లో 71 పరుగులు) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.లక్నో సూపర్ జెయింట్స్ స్కోరు:17 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని (167 పరుగులు) ఛేదించింది. మిచెల్ మార్ష్ 38 బంతుల్లో 90 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్ అవకాశం లేనట్లే అని చెప్పొచ్చు. లక్నో బౌలర్ ఆకాశ్  మొదట్లోనే  చెన్నైని దెబ్బ తీసి మూడు  వికెట్లు పడగొట్టాడు
లక్నో జట్టు ఛేజింగ్ లో ఓపెనర్ మార్ష్,మరియు ఇంగ్లిష్ పటిష్టమైన భాగస్వామ్యం సాధించారు.మార్ష్ దురదృష్ట వశాత్తూ 90 పరుగుల కి రనౌట్ అయ్యాడు.జోష్ ఇంగ్లిష్ 36, పూరన్ 32 పరుగులు చేసి జట్టు విజయానికి పెద్దగా తోడ్పడ్డాడు.  16.4  ఓవర్లలో కేవలం 3 వికెట్లకి 168 పరుగులు చేసింది. పట్టిక అట్టడుగున కేవలం ఏ ఛాన్స్ లేని లక్నో జట్టు చెన్నై మీద గెలిచి దెబ్బ తీసింది. చెన్నై బౌలర్లు చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చారు.
ఇప్పుడు సి ఎస్ కె ప్లే ఆఫ్ లోకి ప్రవేశించాలంటే, సన్ రైజర్స్ మరియు గుజరాత్ లతో జరిగే చివరి రెండు మ్యాచ్ లలో విధిగా గెలవాలి.  శుక్రవారం మ్యాచ్ లో ఆకాశ్ బౌలింగ్ ఒక అద్భుతం. స్కోర్లు. : చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేస్తే లక్నో జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి168 పరుగులు సాధించి గెలిచింది.
Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *