వైభవ్ తుపాను : లక్నో గల్లంతు


** ప్లే ఆఫ్స్ చేరిన రాజస్థాన్ రాయల్స్ **


వైభవ్ సూర్య వంశీ పేరు తల్చుకుంటే ప్రత్యర్థి జట్టు కు ముచ్చెమటలు పడతాయి. జైపూర్ లో అంటే తమ కోటలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ప్రతిష్టాత్మక పోటా పోటీలో రాజస్థాన్ రాయల్స్ లక్నోను ఏడు వికెట్ల తేడాతో మట్టి కరిపించి ,ప్లే ఆఫ్స్ లో దీటుగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎల్ ఎస్ జి ఐదు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి నిజానికి గట్టి పోటీనే ఇచ్చింది.అంత పెద్ద స్కోర్ కాస్తా వైభవ్ ఆట ధాటికి వెలవెలబోయింది. ఓపెనర్స్ అయిన మార్ష్ 96 పరుగులతో రన్ ఔట్ అయ్యాడు.హింగ్లీష్ కూడా 60 పరుగులు చేసి మొదటి వికెటుకు 109 పరుగులు చేయడం సామాన్య విషయం కాదు. అయితే తరువాత బ్యాటింగుకు వచ్చినవారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారు. పూరణ్ 16, పంత్ 35 పరుగులు చేసి జెండా ఎత్తేశారు.రాయల్స్ బౌలర్లలో ఆర్చర్ 1,పంజా 2 వికెట్లు తీశారు. మరికొన్ని ఓవర్లు ఉండిఉంటే ఎల్ ఎస్ జి పెద్ద స్కోరే చేసిఉండేది. అయిన క్రికెట్ లక్షణమే అంతా.ఎప్పుడు ఏం జరుగు తుందో తెలీదు. .లక్నో పెట్టిన లక్ష్యాన్నిఅందుకోడానికి రాజస్థాన్ వేట మొదలుపెట్టింది. 221 పరుగులు 20 ఓవర్లలో చేయాలి. వైభవ్ వంశీ జురెల్ భాగస్వామ్యంలో మంచి స్కోరు చేశారు వైభవ్ బ్యాటింగ్ ఊపులో సవాయ్ మాన్సింగ్ స్టేడియం దద్దరిల్లింది. తన సెంచరీ కి ఇంకా ఏడు పరుగుల దూరంలో ఉండగా సూర్య వంశీ ఔట్ అయ్యాడు. 38 బంతుల్లో 14 వ ఓవర్లో ఔట్ అయ్యాడు.అయితే అప్పటికే రాయల్స్ ప్లే ఆఫ్స్ స్థానం ఖాయం అయిపోయింది.గెలుపు లాంఛనం మాత్రమే అయింది.సూర్య వంశీ తన 38 బంతుల ఆటలో 7 బౌండరీలు,10 సిక్సులు బాది కేవలం 17 బంతుల్లో నిలుచున్న చోటు నుంచి కదల కుండా 88 పరుగులు చేసి ప్రేక్షకులకు బ్రహ్మాండమైన కనువిందు చేశాడు. మంగళవారం సూర్య ఆటకి తిరుగు లేక పోయింది.పేస్, స్పిన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. వంశీ ఆటకు ఎస్వీ జైస్వాల్ గట్టి పునాది వేశాడు..తరువాత జురేల్ తో చేసిన భాగస్వామ్యం గొప్పగా ఉపకరించింది. జురేల్ 53 స్కోరు చెసి నాటౌట్ గా ఉన్నాడు. రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి,19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ తో వైభవ్ 579 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో ఇప్పటికీ ఇదే అత్యధికం. –– ఎన్ ఆర్ ఎస్

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *