
**పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం
పంజాబ్ కింగ్స్ తిరుగులేని విధంగా సూపర్ గా ఆడి ఓటములను తట్టుకుని ఎదురీది లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి కథని తిరగ రాసి ,ప్లే ఆప్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ విజయం లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పాత్ర ప్రధానం.ఈ సీజన్లో తన తొలి. సెంచరీ చేసి అయ్యర్ మ్యాచ్ ను ఎత్తుకు పోయాడు.కేవలం 51 బంతుల్లో 101 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచి గెలిపించాడు. ఈ మ్యాచ్ నిజంగా శ్రేయాస్ మ్యాచ్ గా చెప్పుకోవచ్చు.శ్రేయాస్ కన్నా ముందు బ్యాటింగ్ కు వచ్చిన ఆర్య 0, కనొల్లి 18,షెడ్జ్ 9 పరుగులు చేసారు. అయితే ప్రబసిమ్రాన్ సింగ్ మాత్రం 69 పరుగులు చేసి అయ్యర్ కి మంచిసహకారం అందించాడు.
పోతే మొదట LSG కి బ్యాటింగ్ ప్రారంభించిన జోష్ ఇంగ్లీష్ మంచి వూపులో వుండి చక్కటి బ్యాటింగ్ చేశాడు.మంచి ఫారంలో ఉండి పంజాబ్ బౌలర్లని ఒక ఆట ఆడుకున్నాడు. 44 బంతుల్లో72 పరుగులు చేసి లక్నో జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులకు చేరేలా చేశాడు. కులకర్ణి 0, పూరం 2,పరుగులు చేశారు.అయితే బాడోనీ మాత్రం సంయమనం తో ఆడి 43 పరుగులు చేశాడు.సమాద్ 37 పరుగులతో నాటవుట్ గా నిలిచాడు.పంజాబ్ బౌలర్లలో ఒమర్ జై 1,జాన్సన్ 2, చాహల్ 2 ,శశాంక్ ఒక వికెట్ పడగొట్టారు.
తరువాత ఛేజింగ్ మొదలు పెట్టిన పంజాబ్ జట్టు.గట్టి సమాధానం ఇచ్చింది.తొలుత వికెట్లు పడిపోయినా ప్రబసిమ్రాన్ సింగ్ , శ్రేయాస్ ఆటని నిల బెట్టారు .ప్రధానం గా కెప్టెన్ శ్రేయాస్ వచ్చాక ఆటతీరు మారి పోయి.జోరు పెరిగింది. గెలుపు పంజాబ్ వైపు మొగ్గింది .ఆర్య పరుగులేమి చేయకుండా ఔటయ్యాడు. పి సింగ్ అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో 69 పరుగులకు ఎల్ బి డబ్ల్యు అయ్యాడు. కనొల్లి 18 పరుగులకే బౌల్డ్ అయ్యాడు.అక్కడి నుంచి అంతా తానే అయి శ్రేయాస్ విజృంభించి జట్టుకు 18వ ఓవర్లోనే జట్టును విజయ తీరానికి చేర్చాడు. ఏ దశలోను లక్నో బౌలర్లు ప్రభావం చూపించలేక పోయారు. షమీ రెండు వికెట్లు, అర్జున్ టెండూల్కర్ ఒక వికెట్ తీశారు.
మొత్తం మీద ఈ సారి ఐపీఎల్ అన్ని జట్లతో దోబూచులు ఆడి ది. ఏ జట్టుకు కూడా కునుకు పట్టనివ్వలేదు.
—ఎన్ ఆర్ ఎస్





