
న్యూ చండీగఢ్ లో బుధవారం జరిగిన ఉత్కంఠ భరితమైన పోటీలో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ప్రదర్శనతో సన్ రైజర్స్ హై దరాబాద్ పై 47 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో క్వాలిఫైయర్ కు అర్హత సంపాదించింది. సన్ రైజర్స్ కెప్టెన్ ఫ్యాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి రాజస్థాన్ జట్టుకు బ్యాటింగ్ ఇచ్చాడు. తాను ఫీల్డింగ్ ఎంచు కున్నాడు. ఎస్ ఆర్ హెచ్ పాలిట అదే శాపం అయింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకుని పూర్తి లాభాన్ని పొందారు రాజస్థాన్ రాయల్స్. మంచి ఫారం లో వున్న ఓపెనర్లు జైస్వాల్ ,సూర్య వంశీలు దొరికిందే అవకాశం అన్నట్టు విజృంభించి ప్రేక్షకులకి కను విందు చేసారు. జైస్వాల్ 29 బంతుల్లో 4 బౌండరీలు బాది29 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో పక్క వైభవ్ సూర్య వంశి గ్రౌండ్ నలుపక్కలా కళ్ళు చెదిరే షాట్ లు కొట్టి భారీగా పరుగులు చేశాడు. కేవలం 29 బంతుల్లో12 సిక్సెర్ లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు సాధించాడు. మరో పక్క జరెల్ కూడా కూడా ఇదే అదను అనుకుని 21 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు కు పునాది వేశాడు. 3 సిక్సర్లతో,5 బౌండరీలతో భారీ స్కోరు చేసి ఆదుకున్నాడు. తరువాత వచ్చిన పరాగ్ కేవలం 26 , పేరీరా 12,శనకా 5, జడేజా 12 నాటవుట్, జొహరా ఆర్చర్ 4 పరుగులు చేశారు. మొత్తం మీద ఇరవై ఓవర్లలో రాజస్థాన్ జట్టు 8 వికెట్లు పోగొట్టు కుని 243 పరుగులు చేసింది.నిజానికి ఈ స్కోర్ ఛేజింగ్ కోసం కష్టమే అవుతుంది.ముఖ్యంగా రాయల్స్ రెండు రన్ ఔట్లతో స్కోర్ ఎక్కువ చేయ లేక పోయారు.లేకపోతే స్కోర్ 270 దాకా వెళ్లి వుండేది.ఏదిఏమైనా సూర్య వంశీ మాత్రం జట్టు పరువూ నిలబెట్టాడు.బౌలింగ్లో గొప్పతనం మాత్రం లేదు.ఒక్క హింగ్ మాత్రం 54 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. తడబడుతూ ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్ రైజర్స్ పరుగులేమీ చేయకుండానే స్కోర్ కే ఓపెనర్ శర్మ అవుట్ కావడం జట్టుకు నిరాశ కలిగించింది. ఇక్కడ బౌలింగ్ జొహరా ఆర్చర్ చేతిలో వుంది.అతన్ని జాగ్రత్తగా ఎదుర్కోక పోతే మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ఇషాన్ కిషన్ కొంతసేపు ఆశలు కలిగించినా 33 పరుగులు చేసి ఆర్చర్ భౌలింగ్ లో వెను దిరిగాడు. రవి చంద్ర న్ 1, క్లాసేన్ 18,చేసి ఔట్ అయ్యారు.అయితే కాసేపు నితీష్ కుమార్ రెడ్డి,(38),ఆరోర (35)పోరాడారు. చివర్లో కుమార్ 27 పరుగులు చేసి కాసేపు పోటీ ఇచ్చాడు.19.2 ఓవర్లో 196 పరుగులు చేసి హైదరాబాద్ జట్టు అలవుట్ అయింది.షరా మామూలే అన్నట్టుగా ఆర్చర్ మొదట్లో దెబ్బ తీసి 58 పరుగులకు 3 వికెట్లు తీశాడు.ఓల్డ్ వారియర్ రవీంద్ర జడేజా 2 వికెట్లు,మిశ్రా2 వికెట్లు,పుంజ 1 వికెట్ పడగొట్టి 19.1 ఓవర్లో లాంఛనం పూర్తి చేశారు. ఈ గెలుపుతో రాజస్థాన్ ఇదే గ్రౌండ్ లో శుక్రవారం నాడు గుజరాత్ టైటాన్స్ తో రెండో క్వాలిఫైయర్ లో తలపడు తుంది.





