****ఆగస్టు 22 చిరంజీవి జన్మదినం

ఆగస్టు 22 అనగానే అందరికీ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం గుర్తుకువస్తుంది . 1977 నుంచి నేటి వరకు దాదాపు ఐదు దశాబ్దాలు వెండితెర చిరు నటనతో మురిసిపోయింది పునాదిరాళ్లు నుంచి మన శంకర వరప్రసాద్ వరకు తనదైన నటనని ఆవిష్కరించారు చిరంజీవి పేరు చెప్పినప్పుడు వేగంగా కదిలే నృత్యాలు బలమైన పోరాటాలు స్మరణకు వస్తాయి . 1950 నుంచి 80వ దశకం వరకు తెలుగు సినిమా కేవలం ఎన్టీఆర్ అక్కినేని కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబులు అగ్రతారలుగా తెలుగు సినిమాను శాసించారు. చిరంజీవి కొత్త పద్ధతులకు అడుగులు వేశారు. తెరమీద యువతరంగం సినిమా రంగాన్ని సినిమా రంగంలో ప్రవేశించి నవ్యతకి స్వాగతం పలికారు అదే సమయంలో అదే సమయంలో సినిమా జోనర్ల పరిధి పెరిగింది. చిరంజీవి దర్శకుల నటులు. అన్ని భావోద్వేగాలని సమంగా పండించారు కే విశ్వనాథ్, బాపు, బాలచందర్ వంటి పాత దర్శకుల వద్ద ప్రతిభ ద్వారా రాణించారు. దాసరి రాఘవేంద్రరావు జంధ్యాల వంశీ , కోడి రామకృష్ణ వంటి దర్శకుల వద్ద విజయవంతంగా పాత్రలకి న్యాయం చేకూర్చారు. తర్వాత కాలంలో రవి రాజా, బాబి పరశురాం, వశిష్ట, అనిల్ వంటి దర్శకుల వద్ద కాలానికి అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు . చిరంజీవి చిత్రాలలో రౌద్ర భావోద్వేగాలు అధికంగా కనపడతాయి. ఖైది, రక్తసింధూరం, స్నేహం కోసం, సైరా చిత్రాలలో సంభాషణలు కథలను శక్తివంతంగా ఆవిష్కరించాయి ఈ చిత్రాలలో రోషంగా కోపాన్ని బాగా అభినయించారు. చిరంజీవి సినిమాల్లో హాస్యం బాగా పండింది మంత్రిగారి వియ్యంకుడు, రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, శంకర్ దాదా చెప్పుకోదగ్గవి. వాటిలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్ హాస్యాన్ని చక్కగా తెరమీద కురిపించింది చిరంజీవి గారు చిత్రాల్లో కొన్ని రొటీన్ కి భిన్నంగా వచ్చాయి అంజి, మృగరాజు, మంజునాథ, ఆరాధన , రుద్రవీణ చిత్రాలు ఇమేజిని దాటి కథపైన దృష్టికి నిలిపి దర్శకులు నడిపించారు ఆర్థికంగా విజయం సాధించకపోయినా అవి చిరంజీవి అభిరుచికి సాక్ష్యంగా నిలిచాయి . 90వ దశకం తర్వాత చిరంజీవి కీర్తి ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింది ఇమేజ్ అందుకే తన పలుకుబడిని సేవాభావం వైపు మళ్లించారు. తన అశేష అభిమానుల కోసం చిరంజీవి ట్రస్టు ద్వారా నేత్రనిధి రక్త నిధి ఏర్పాటు చేసి లక్షలాది ప్రజలకు సేవలు అందించే ప్రయత్నం జరిగింది. చిరంజీవికి పలు నంది పురస్కారాలు , పద్మ పురస్కారాలు ప్రభుత్వం అందించింది. రాజకీయాలలో ఒక దశాబ్ద కాలం ఉన్నారు పర్యాటక శాఖ మంత్రిగా, భారతదేశం అంబాసిడర్ గా మెగాస్టార్ గా ఎదిగారు . చిరంజీవి అల్లు వారి అల్లుడని సగౌరవంగా చాటే స్థాయికి వచ్చారు ఏడు పదులు దాటినా తన శరీరాన్ని నియంత్రించుకుని వ్యక్తి చిరంజీవి. ఆయన నటించిన విశ్వంభర 158వ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శతమానం భవతి..
— డాక్టర్ డి.వి.ఎస్.ఎస్. శర్మ , పరిశోధకులు , 99490 39175.








