‘మహేంద్రగిరి వారాహి’ స్క్రీన్ ప్లే మ్యాజిక్

సినిమా జోనర్ల పరిధి పెరిగింది పలు రకాలైన చిత్రాలు రావడం ఇందుకు నిదర్శనం. సోషియో ఫాంటశీ కథలు ఎప్పుడూ కొత్తగా అనిపిస్తాయి. ‘అమ్మోరు’ నుంచి ‘మగధీర’ ‘అరుంధతి’ ఇలా అన్నీ భక్తి భావం, సామాజిక అంశాలు కలబోతగా తెర మీద పండాయి. కథా కథనాలు అంతా వారాహి అమ్మవారి మీద దృష్టి కేంద్రీకరించి చిత్రించారు. వారాహి అమ్మవారు శక్తి అవతారాలలో ఒకటి. జనాధరణ పొందిన నటులు పవన్ కళ్యాణ్ వారాహిని తన ఇష్ట దైవంగా కొలవడం వల్ల ఇటీవల వారహి అమ్మవారు మరింత ప్రచారంలోకి వచ్చింది. విచిత్రంగా ఈరోజు పేరుతో సినిమా రావడం విశేషం. సినిమా కథకి లాజిక్ ఉండదు. అది కల్పన మీద నడుస్తుంది. నవతరం దర్శకులు జాగర్లమూడి సంతోష్ అమ్మవారిని ఆధారంగా చేసుకుని 150 నిమిషాలు సినిమాని తెరమీద ప్రదర్శించారు. ఇది ఒకరకంగా దర్శకునికి పరీక్షవంటిది. సినిమా కథాకథనాలు వారాహి పురం చుట్టూ జరిగే హత్యలు అంశాల మీద నడుస్తాయి. 33 సంవత్సరాలు నిండిన రాజవంశీలని అమ్మవారి బలి తీసుకుంటుందని అందరూ భావిస్తారు కానీ అసలు నిజం ఏమి దాగుందనేది తెర మీద చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది చిత్రంలో అందరూ పలుకుబడి కలిగిన సినీ తారలు నటించారు. మంజు భార్గవి, బ్రహ్మానందం చాలాకాలం తర్వాత తెర మీద కనబడ్డారు. బ్రహ్మానందం పాత్ర ఎవరూ ఊహించని రీతిలో చిత్రీకరించారు. సిద్ధూ పాత్ర సినిమాని పరిచయం చేస్తుంది. సుమంత్ కి చాలా కాలం తర్వాత ఈ సినిమా సంతృప్తినిస్తుంది. ఎక్కువ భాగం అటవీ ప్రాంతంలోను, జి తెలుగు స్టూడియోలోనూ చిత్రీకరించారు.చిత్రంలో పాటలు బ్యాక్గ్రౌండ్ లో వస్తాయి సినిమాలు ఎక్కువ చూసేవారు ముగింపును ఊహస్తారు. వెన్నెల కిషోర్ పాత్రలో స్తుంది. సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి వెళ్లి చూడవచ్చు

–డాక్టర్ దువ్వూరి శర్మ, సినీ పరిశోధకులు, 99490 39175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *