చూచువారలకు చూడ ముచ్చటగా……


కాప్రా సర్కిల్ లోని సైనిక్ పురి, యాప్రాల్, పద్మశాలి టౌన్షిప్ లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.
కళ్యాణం, శోభా యాత్రలలో నివాసులందరూ కలసికట్టుగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. కళ్యాణం తరువాత
విందు జరిగింది. కల్యాణంతో పాటు భజన, చిన్నారుల నృత్యప్రదర్శనలు అలరించాయి. శోభాయాత్రలో
భాగంగా కాలనీలలోని అన్ని వీధుల్లో కోలాటాలు ఆడుతూ సీతారాముల విగ్రహాలను ఊరేగించడం జరిగింది.
ఓ యు టి కాలనీ రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. కళ్యాణం తరువాత
కాలనీతో పాటు మాధవపురి, సాయిబాబా ఆఫీసర్ కాలనీలో శోభాయాత్ర జరిగింది. శ్రీ రామ నవమి వేడుకలలో
ఈ సంవత్సరం సీనియర్లతో పాటు యువత కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేకత.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *