క్రీడల నేపథ్యంలో ‘బైకర్’

తెలుగు సినిమా పరిధి పెరిగింది. సాంఘిక కథనాల జోనర్ నుంచి వివిధ జోనర్లకు చెందిన
కథా, కథనాలు తెర మీదకు చేరాయి. తెలుగు సినిమా పరిశ్రమకు క్రీడల మీద వచ్చిన సినిమాలు
పరిమితంగా ఉన్నాయి. క్రికెట్ ఇతివృత్తంగా గడచిన కొన్ని దశాబ్దాలలో కొన్ని సినిమాలు వచ్చాయి.
బైక్ రేసింగ్ కథా వృత్తం ఆధారంగా ఈ సినిమా నిండి ఉంది. క్రీడల అంశం జతగా కుటుంబ
నేపధ్యం ఉన్న సన్నివేశాలను చేర్చారు. ఇది సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని మిగిల్చింది. సీనియర్
కథానాయకుడు రాజశేఖర్, నవతరం కథానాయకుడు శర్వానంద్ ఇరువురూ తండ్రి కొడుకులుగా నటించారు.
కథానాయిక మాళవికా నాయర్. కథ, కథనాల రూపకల్పనలో క్రీడలపైన దృష్టి ఎక్కువగా కేంద్రీకరించారు. ప్రథమ భాగం అంతా
నిదానంగా నడిచినప్పటికీ, ద్వితీయ భాగం వేగంగా నడిచింది. తండ్రీ కొడుకుల మధ్య బాంధవ్యాలు
సెంటిమెంట్ విషయాలు తెరపైన బాగా పండాయి. దర్శకుడు అభిలాష్ రెడ్డి
విదేశాలలో బైక్ రేసింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. క్రీడాంశాలలో కుటుంబ సన్నివేశాలను
జోడించారు. అయితే దర్శక, రచయితలు కుటుంబ భావోద్వేగాలపైన పరిమితంగా దృష్టి సారించారు.
ప్రేమ, భయం, ఆసక్తి, అసూయ ఇలా భావోద్వేగాలు అన్ని కథను నడిపాయి.
రాజశేఖర్ పాత్రను ఇంకా బలంగా చిత్రీకరిస్తే బాగుండేది. పాటలు కూడా ఇంకా క్యాచీగా తీస్తే
మరింత ఆదరణ లభించేది. గతంలో ‘ఒక్కడు’ కూడా క్రీడల నేపథ్యంలో తీసిందే.
వేసవిలో వస్తున్న ఇతర చిత్రాలతో పోల్చినప్పుడు బైకర్ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త తరహా
క్రీడాచిత్రమని చెప్పవచ్చు. —— డాక్టర్ దువ్వూరి శర్మ , 9949039175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *