
వాహ్ కెప్టెన్! పటిదార్ విశ్వరూపం
ప్రతిభ చూపిన పటిదార్. 33 బంతుల్లో 93 పరుగులు చేసి నాటవుట్ గ నిల్చి వాహ్ కెప్టెన్ అనిపించుకుని దర్జాగా గుజరాత్ టైటాన్స్ ను ఓడించి తన ఆర్ సి బి జట్టును 2026 ఐ పి ఎల్ ఫైనల్ కి తీసుకు వెళ్ళాడు. ఆర్ సి బి నేరుగా ఫైనల్ కు దూసుకెళ్లడం రెండవసారి. ఇది నిజంగా పటిదార్ ప్రతిభే . .టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కి దిగిన ఆర్ సి బి 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో మట్టి కరీపించి ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి అభిమానులు అరివీర భయంకరంగా ఆడుతున్న ఓపెనర్ విరాట్ కోహ్లీ ఆట చూడ్డానికి పోటెత్తారు.కానీ పటిదార్ తన విశ్వ రూపం ప్రదర్శించి ప్రేక్షకులకు బోనస్ ఇచ్చాడు. కోహ్లీ కూడా ఏం తక్కువ తినలేదు. 43 అద్భుతమైన పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇంకొక విశేషం ఏమిటంటే కోహ్లీ వరుసగా నాలుగో ఐ పి ఎల్ సీజన్ లో 600 పరుగులు పూర్తి చేసి రికార్డు నెలకొల్పాడు. మరో ఓపెనర్ అయ్యర్ మాత్రం 19 పరుగులకు రబాడ చేతిలో ఔట్ అయ్యాడు.పడిక్కల్ మాత్రం 30 పరుగులు చేసి,హోల్డర్ చేతిలో ఔట్ అయ్యాడు. పాండ్యా కూడా జాగ్రత్తగా ఆడి తన ప్రతాపం చూపించాడు.43 పరుగులు చేసి రాబడ చేతిలో ఔట్ అయ్యాడు. డేవిడ్ నాలుగు పరుగులకు తొందరగా వెనుదిరిగాడు . ఒక పక్క పటిదార్ మాత్రం విజృంభించి, ఎడాపెడా షాట్లు కొడుతూ స్కోర్ పరుగుపెట్టించాడు. ఆర్ సి బి స్కోరు 20 ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులకు తీసుకు వెళ్ళాడు.ఏ దశలోనూ కూడా గుజరాత్ జట్టుకు ఊరట లభించ లేదు. చేజింగ్ లో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జట్టు ఏ దశ లోనూ నిలదొక్కుకో లేక పోయింది వికెట్లు వరుసగా పడిపోతూ పవేర్ ప్లే సమయం కంటే ముందే అంటే ఆరు ఓవర్లలో 3 వికెట్లు 51 పరుగులకు పడ్డాయి. ఆరు ఓవర్ల తరువాత.మ్యాచ్ కేవలం లాంఛనమే అయింది. చివరకి 19.వ ఓవర్లో 3 వ బంతికి చాప చుట్టేశారు. మొత్తం మీద 162 పరుగులు మాత్రమే చేశారు. ఆర్ సి బి బౌలర్లు ప్రతిభావంతం గా బౌలింగ్ చేశారు.డఫ్ట్ 39 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు హెజెల్వుడ్.1 ,సలాం 2,వికెట్లు తీశారు. ఆర్ సి బి మొత్తం మీద మొదటి నుంచి ధాటిగానే ఆడింది.
--Nidamarthi Rajashekar.





