అంచనాలకు భిన్నంగా దృశ్యం – 3

       దృశ్యం సినిమా గత పది వసంతాలుగా దక్షిణ భారత సినిమా రంగంతో  అనుబంధం కలిగి ఉంది మన తెలుగులో రెండు భాగాలుగా పలకరించింది ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది వెంకటేష్ మీనా ఇద్దరూ దృశ్యం చిత్రానికి  జీవం పోశారు మలయాళ కథలు సృజన పరమైనవి. ఈ విషయం  అందరికీ పరిచయమే కాక అలరిస్తాయి. అంతిమ తీర్పు , న్యాయం కోసం,  మాతృదేవత చిత్రాలు అక్కడివే.   ఆ కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి .  రీమేక్ చిత్రాల కథానాయకుడిగా పరిచయమైన  వెంకటేష్  ఈసారి దృశ్యం -3 చిత్రానికి తన సమయం కేటాయించలేదు . దృశ్యం , దృశ్యం-2  విజయాలకి వెంకటేష్ సారధి అయ్యారు.  మలయాళ కథానాయకుడు మోహన్ లాల్ , మీనా ఇద్దరూ దృశ్యం -3 లో నటించారు జీతూ జోసెఫ్ దర్శకుడుగా కథను కొనసాగించిన తీరు మలయాళంలో పండిన విధంగా  పనిని విధంగా తెలుగులో పండలేదు అనిపించింది.   తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఎంతగా ఆస్వాదించినా పాటలు , హాస్యం తదితర భావోద్వేగాలని విపరీతంగా ఆరాధిస్తారు . అవిలేని పక్షంలో వెలితిగా భావిస్తారు దృశ్యం -3 చిత్రం ప్రథమ భాగమంతా కూతురి వివాహ ప్రయత్నాలు గురించి ఉంటుంది. అందుకే కథ నెమ్మదిగా నడుస్తుంది ప్రేక్షకులకు ఇది అంతగా రుచించలేదు కదా కథనాలని సాగదీసిన వైఖరి కనపడింది విశ్రాంతి తర్వాత కథానాయకుడు చేసిన తెలివైన పొరపాటు గురించి మరల పరిశోధన మొదలవుతుంది చట్టానికి దొరకకుండా చేసిన ప్రయత్నాల గురించి మరల పోలీసు, మీడియా వారు శోధిస్తారు ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో వెళ్లిన దారి కనపడదు మొదటి రెండు భాగాలు కదా కథ కథనాలు దృశ్యాల పరంగా భావోద్వేగాలపరంగా మనస్సుని స్పందింప చేశాయి ఈసారి సస్పెన్స్ సన్నివేశాలను దర్శకుడు సరిగా చిత్రీకరించినా అవి అంతగా ఆకర్షించే లేకపోయాయి. ఒక్కొక్కసారి కథలు అందరిని అలరిస్తాయి కానీ అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. ఒక్కొక్కసారి ప్రాంతీయపరమైన అంశాలు అభిరుచులు కథలు తాలూకా విజయాన్ని నిర్ణయిస్తాయి ఇది దృశ్యం - 3చిత్రం నిరూపించింది. దృశ్యం సీక్వెల్ 3వ భాగం మిశ్రమ స్పందనని అందుకుంటోంది.
--- డాక్టర్ దువ్వూరి శర్మ , సినీ పరిశోధకులు , 99490 39175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *