అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా వివిధ పాఠశాలలు, కాలనీలలో యోగా
శిక్షణ ఇస్తున్న మాస్టర్లకు సన్మానం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం
సందర్బంగా సన్మాన కార్యక్రమాన్ని కవాడిగూడ లోని సిజిఓ టవర్స్ లో నిర్వహించారు.
తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఉన్న యోగా సంస్థలు, విద్యా సంస్థల
ఆత్మీయ సమ్మేళనం మరియు , సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ
ప్రాంతాలకు చెందిన యోగా మాస్టర్లను శనివారం కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సన్మానించారు.
సన్మానం పొందిన వారిలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు,
, కాప్రా ప్రాంత యోగా మాస్టర్ వనమాల శంకర్ ఉన్నారు. చిత్రంలో శంకర్ ను కేంద్రమంత్రి
సన్మానించడాన్ని చూడవచ్చు.









