రంజింపజేస్తున్న వసంతోత్సవం

కాప్రా దగ్గరి సాకేత్ కాలనీలో సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంతోత్సవం 2026లో భాగంగా మంగళవారం కళోత్సవం ఆరవ రోజు శ్రీమతి డాక్టర్ సప్ప భారతి భగవతారిణి “శ్రీ రామ జననం”
హరికథా గానం చేశారు. ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు అన్ని వయసుల వారికి
ఆసక్తి కలిగించే విధంగా ఆద్యంతం భారతీయ సంస్కృతిని మేళవించిన పిట్ట కథలతో హరికథ సాగింది.
ఉగాది రోజు మొదలైన కార్యక్రమాల్లో తొలిరోజు ఉదయ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పంచాంగ శ్రవణం తరువాత ఉగాది హేల నృత్య నాటికను ప్రదర్శించారు. తొమ్మిది రోజుల
కళోత్సవంలో రోజుకో కళా రూపాన్ని ప్రదర్శించడం విశేషం.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *