హైదరాబాద్ స్పీడ్ కు బ్రేక్


ఇండిఎన్ ప్రీమియర్ లీగ్ లో మే 3వ తేదీన రెండు మ్యాచ్ లు జరిగాయి. ఒకటి హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు(ఎస్.ఆర్. హెచ్) కు కోల్ కతా నైట్ రైడర్స్ (కెకె ఆర్) కు మధ్య ఆదివారం మధ్యాహ్నం జరిగింది. రెండో మ్యాచ్ అహ్మదాబాద్ లో పంజాబ్ కింగ్స్ ( పిబికెఎస్) కు గుజరాత్ టైటాన్స్ (జిటి) కు మధ్య జరిగింది.
ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ టీమ్ స్పీడ్ కు ఈ మ్యాచ్ లో బ్రేక్ పడింది. ఎస్సార్ హెచ్ పై కెకె ఆర్ గెలిచింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్: బ్యాటింగ్ – అభిషేక్ శర్మ 15, హెడ్ 61, ఇషాన్ కిషన్ 42. క్లాసెన్ 11. మొత్తం 19 ఓవర్లలో 165కు ఆలౌట్. బౌలింగ్: కమిన్స్ 1, శివాంగ్ 1, స్కిల్స్ 1.
హైదరాబాద్ ఇంతవరకూ 10 మ్యాచ్ లు ఆడింది. 6 గెలిచింది. 4 ఓడింది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది.
కోల్ కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్:
బ్యాటింగ్: రహానే 43, అలెన్ 29, రఘువంశీ 59, తింటూ సింగ్ 22. మొత్తం స్కోర్ 18.2 ఓవర్లలో 169.
బౌలింగ్: నరైన్ 2, వైభవ్ అరోరా 1, త్యాగి 2, గ్రీన్ 1, వరుణ్ 3, అనుకుల్ ఒక వికెట్ పడగొట్టారు.
కోల్ కతా ఇంతవరకూ 9 మ్యాచ్ లు ఆడింది. 3 గెలిచింది. 5 ఓడింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.

గుజరాత్ కు హ్యాట్రిక్ గెలుపు
మే 3వ తేదీ అహ్మదాబాద్ లో రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ పై గుజరాత్ విజయం సాధించింది. మొన్నటిదాకా ఎదురు లేకుండా విజయాలు సాధించిన పంజాబ్ కు ఇది మరో దెబ్బ. ఈ మ్యాచ్ తో గుజరాత్ టైటాన్స్ (జిటి) హ్యాట్రిక్ విజయం.
పంజాబ్ ఇన్నింగ్స్:
బ్యాటింగ్.షెడ్జే 57, స్టాయినిస్ 40, యాన్సెన్ 20 రన్స్ చేశారు. మిగతా బ్యాటర్స్ రాణించలేక పోయారు. స్కోర్: 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163. బౌలింగ్: అర్షదీప్ 2, యాన్సెన్ 1, వైశాక్ 2, ‌స్టాయినిస్ 1.
గుజరాత్ ఇన్నింగ్స్:
బ్యాటింగ్. సుదర్శన్ 57, బట్లర్ 26, సుందర్ (నాటౌట్) 40. మొత్తం 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167.
బౌలింగ్: సిరాజ్ 2, హోల్డర్ 4, రషీద్ 1.
పంజాబ్ ఇంతవరకూ 9 మ్యాచ్ లు ఆడింది. 6 గెలిచింది. 2 ఓడింది. ఒకదాని ఫలితం తేలలేదు. పట్టికలో మొదటి స్థానంలో ఉంది.
గుజరాత్ ఇంతవరకూ 10 మ్యాచ్ లు ఆడింది. 6 గెలిచింది. 4 ఓడింది. 5వ స్థానంలో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
జైపూర్ లో మే డే రోజున రాజస్థాన్ రాయల్స్ (ఆర్. ఆర్) ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో డీసీ గెలిచింది. ఈ సీజన్లో హ్యాట్రిక్ పరాజయాలను చూసిన ఢిల్లీకి ఈ గెలుపు ఊరట నిచ్చింది.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్: జురేల్ 42, పరాగ్ 90, జడెజా 20, ఫెరీరా 47(నాటౌట్). 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయల్స్ 225 పరుగులు చెసింది. వైభవ్ నిరాశపరిచాడు. ఢిల్లీ బౌలింగ్: ఆర్చర్ 1, తుషార్ 1, జడేజా 1 వికెట్లు తీసుకున్నారు.
ఈ సీజన్లో ఇప్పటివరకూ ఆర్. ఆర్. 10 మ్యాచ్ లు ఆడింది. 6 గెలిచింది. 4 ఓడింది.
ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్స్: నిశాంక 62, కె.ఎల్. రాహుల్ 75, నితీష్ రానా 33, స్టబ్స్ 18(నాటౌట్), అశుతోష్ 25 (నాటౌట్). మొత్తం 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 226. బౌలింగ్: స్టార్క్ 3, జెమీసన్ 1, అక్షర్ 1, నటరాజన్ 1 వికెట్ తీసుకున్నారు.
9 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ 4 గెలిచింది. 5 ఓడింది.

సి ఎస్ కె కు మరో విజయం
చెన్నైలో మే రెండవ తేదీన జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చిరకాల ప్రత్యర్ధులు చెన్నై సూపర్ కింగ్స్ (సి.ఎస్కే) – ముంబై ఇండియన్స్ ( ఎం. ఐ) జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా ముంబై పరిస్థితి ఏ మాత్రం మారలేదు. వరుస ఫ్లాపులతో ఈ టీమ్ ఇక ప్లే ఆఫ్ ఆశ వదులుకున్నట్టే. టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకున్నది. కానీ చెన్నై బౌలర్ల ధాటికి ముంబై బ్యాటింగ్ లో ఒకరిద్దరు మినహా తట్టుకోలేక పోయారు. సెర్వికల్ 37, నమన్ 57, ట్రెవిస్ 18. మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
ముంబై బౌలింగ్: బుమ్రా 1, ఘజన్ ఫర్ 1.
చెన్నై ఇన్నింగ్స్: రుతు రాజ్ గైక్వాడ్, కార్తీక్ స్థిరంగా, తడబడకుండా ఆడారు. వీరిద్దరూ జంటగా 100కు పైగా పరుగులు చేశారు. రుతు రాజ్ (నాటౌట్) 67. కార్తీక్ శర్మ 54 (నాటౌట్). చెన్నై18.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి మరో విజయాన్ని సొంతం చేసుకుంది.
–వి. మధుసూదనరావు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *