ఆత్మీయ అనురాగాల రక్షాబంధనం

రాఖీ పండుగ అనగానే సోదర సోదరుల అనుబంద క్షణాలు స్మరణకు వస్తాయి మన కుటుంబం అందమైన బొమ్మరిల్లులా ఉంటుంది అందులో అమ్మ, నాన్న , తాతయ్య నానమ్మ సోదరీ సోదరులు ఇంకా ఎన్నో బాంధవ్యాలు నిత్యం ప్రతిక్షణం ఆత్మీయతని ఆస్వాదిస్తారు సోదరీ సోదరీమణుల మమతల్ని మమతల్ని సాన్నిహిత్యాన్ని రక్తసంబంధం సాక్షిగా పంచుకోవడం విశేషం. ఒక్కసారి వాస్తవంగా మనం కుటుంబ సంబంధాల్ని సమీక్షించినప్పుడు సోదరీ సోదరుల బంధం నాటకీయంగా సినిమాలలో, సీరియళ్లలో ఉన్నంతగా కనబడవు సోదరీమణుల మధ్య రక్త సంబంధాన్ని మించి స్నేహ ప్రేమానురాగాలు కనబడతాయి. వీరందరూ ఒకే మాటగా, బాటగా ఉంటారు సోదరుడి మనసులో సోదరి ప్రేమ అంతర్లీనంగా ఉంటుంది. సోదరి అంతరంగం నిరంతరం సోదరుడి శ్రేయస్సును ఆకాంక్షిస్తుంది. ఉద్వేగం కన్నా నిశ్శబ్దం మమకారాన్ని పంచుతుంది. సోదరి మనసు సోదరుడు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలని అతనికి సంపదల కన్నా సుఖసంతోషాలు కలకాలం నిలవాలని ఆశిస్తుంది. తన పుట్టింటి వారు పట్టు చీరలకన్నా పసుపు కుంకుమల్ని కానుకగా ఇవ్వాలి అని ఆశపడుతుంది. తన పుట్టింటి వారిని తలచుకున్నప్పుడు ఆమె మది సంబరపడిపోతుంది. నిజంగా సోదరుడు కూడా సోదరి ఎక్కడ ఉన్నా తనకంటే మంచి స్థాయిలో ఉన్నతంగా ఎదగాలని ఆశించడం అక్షర సత్యం. సోదర సోదరీ అనుబంధాలలో వదిన పాత్ర కీలకం . వదినను అమ్మలా తలచి తన మనసులోని భావాల్ని పంచుకోవడం సర్వసాధారణం. చాలా కథలలో , దృశ్యాలలో వీరిద్దరి మధ్య తగాదాలు , వాదనలు ఉన్నట్టుగా చిత్రీకరిస్తారు నిజానికి ఎంత వయస్సు పెరిగిన వీరిద్దరి మధ్య ఆత్మీయత, అనుబంధం తరానికి తరానికి మధ్య మరింత పెరిగి వీరిద్దరి మధ్య అనుబంధం విస్తరించే అవకాశం ఉంది. రక్షాబంధనం విలువలకు నిదర్శనం అందరికీ రక్షాబంధనం, రాఖీ కట్టే అవకాశం రాకపోవచ్చు. కానీ సహచర ఉద్యోగులను ఉద్యోగుల్ని, సహచర విద్యార్థులని సోదర సోదరీమణులుగా తలంచి రక్షాబంధనంనాడు వారి చేత రాఖీ కట్టించుకుంటారు రక్షాబంధనం అనగానే పార్వతి – శ్రీహరి, శ్రీకృష్ణుడు- సుభద్ర, రాముడు – శాంత, సముద్రుడు – యమున సంబంధం గుర్తుకు వస్తాయి. వెండితెరపై రక్తసంబంధం, గోరింటాకు, కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి బంగారు గాజులు వంటి చిత్రాలు భావోద్వేగాలను కలబోసిన చిత్రకథలు ప్రతి ఒక్కరికి సోదర సోదరీమణుల బంధాలను మరింతగా దగ్గర చేశాయి అందరికీ రాఖీ శుభాకాంక్షలు.
— డాక్టర్ దువ్వూరి శర్మ, అధ్యాపకులు, 99490 39175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *