
కోల్కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బుధవారం జరిగిన ఉత్కంఠ భరితమైన పోటీలో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది.ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి సాధించిన 147 పరుగులని ఎలాగో అధిగమించి ఇంకా 7 బంతులు మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి గట్టెక్కింది.ప్లే అఫ్ రేస్ లో నిలబడింది కోల్కతా జట్టు. నిజంగా ఇది కోల్కతా నైట్ రైడర్స్ కు పెద్ద ఊరట. ఇప్పుడు శక్తి యుక్తులన్నీ కూడగట్టుకుని ప్లేఆఫ్స్ లో ప్రత్యర్థిని ఓడించే అవకాశం వుంటుంది.. బుధవారం జరిగిన పోటీ ఐపీఎల్ 2026లో జరిగే 74 పోటీల్లో 65 వది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోల్కతా ఛేజింగ్ కు ఇష్టపడింది.వాస్తవానికి .ముంబై కూడా ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. .కోల్కతా తన చివరి ఏడు మ్యాచ్ లలో ఆరు నెగ్గినట్టు అయింది.ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయి. .తదుపరి కోల్కతా జట్టు తమ చివరి మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ పై గెలవాల్సి ఉంది. బుధవారం జరిగిన ఆటలో తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన ముంబై జట్టు చిత్తడిగా ఉన్న పిచ్ పై బాగా కష్ట పడాల్సి వచ్చింది.కోల్కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇరవై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు మాత్రమే ముంబై జట్టు చేసింది. రిక్లెటన్ 6. ,శర్మ 15., ధీర్ 0. ,యాదవ్ 15 ,వర్మ. 20 ,పాండ్య. 26. జాక్స్. 14, బాష్ 32, చాహర్ 10 పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లలో దూబే 2 వికెట్లు,గ్రీన్ 2 త్యాగి 2,నరైన్. 1,వికెట్లు పడగొట్టారు.
కోల్కతా జట్టు అంత ధాటిగా మాత్రం ఛేజింగ్ ప్రారంభించ లేదు.మొదటి ఓవర్లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ దీపక్ చార్ బంతిని వికెట్ మీదకి ఆడి అవుట్ అయ్యాడు.తరువాత రాజా 24 పరుగులు చేసి,కీపర్ కు క్యాచ్ ఇచ్చి 21 పరుగులకు అవుట్ అయ్యాడు.
ఎనిమిదవ ఓవర్లలో నైట్ రైడర్స్ మరింత పీకల్లోతుల్లో కూరుకు పోయేది.అప్పటికి 13 పరుగులతో బాటింగ్లో పోవల్ ఉండగా ఒక క్యాచ్ ను చార్. డ్రాప్ చేశారు.ఇక్కడే మనీష్ పాండే లంగర్ దించి పోటీని ఒక స్థిరత్వానికి పీఠం వేశాడు. ఎంతో నిబ్బరంగా ఆడుతూ పాండే 45 పరుగులు సాధించి,నాల్గవ వికెట్ కు పావెల్ తో కలిసి 64 పరుగులు చేశారు.పావెల్ ల్ 30 బంతుల్లో 40 పరుగులు చేసి నెమ్మదిగా గెలుపు వైపు కదిలారు. ఘజెన్ ఫెర్ బౌలింగ్ లో పొవెల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. తరువాత రింకూ సింగ్, అనుకూల్ రాయ్ తతంగం ముగించి జట్టుకు విజయం అందించారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ వైఫల్యం పెద్ద ముంబై అట తీరుపై పెద్ద తేడా చూపించింది.
బాగా ఆడతాడు అనుకున్న బాట్స్మన్ వైఫల్యం ముంబైని ముంచింది.


