‘పరిణతవాణి’ ఉపన్యాస పరంపర

తెలంగాణలో తెలుగు భాష వికాసానికి కృషి చేస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ‘పరిణతవాణి’ పేరిట అరవై ఐదేళ్లు దాటిన సాహితీ ప్రముఖుల స్వీయ సాహిత్య జీవిత విశేషాలను ఆవిష్కరించే ఉపన్యాస పరంపరను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జూన్ 29వ తేదీ సోమవారం సాయంత్రం ఐదున్నరకు ‘మన తెలంగాణ’ సంపాదకులు శ్రీ దేవులపల్లి అమర్ సాహిత్య, పాత్రికేయ జీవిత విశేషాలను ఆయన తమ ప్రసంగంలో వివరిస్తారు. తెలుగు భాష సముద్ధరణకు అంకితమైన సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఇది ఆంధ్ర సారస్వత పరిషత్ శ్రీదేవులపల్లి అమర్ గత 50 సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో వివిధ స్థాయిలలో పనిచేశారు.

శ్రీ దేవులపల్లి అమర్ గురించి ……

     పాత్రికేయ వృత్తిలో స్వర్ణోత్సవం జరుపుకున్న అమర్ నడిచివచ్చిన మైలురాళ్లు, చేరుకున్న 
అక్షర శిఖరాలు ఎన్నో. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అదేవిధంగా ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాకు
సంబంధించిన వివిధ మీడియా సంస్థల్లో పనిచేయడమే కాక జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేశారు..
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో జన్మించిన అమర్ పాత్రికేయ జీవితం ఈనాడుతో మొదలైంది.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పట్టా పొందారు.
ఆంధ్ర భూమి, ఉదయం, సండే అబ్జర్వర్ , ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ఆంధ్ర ప్రభ, ప్రజాతంత్ర
పత్రికలలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఇప్పుడు మన తెలంగాణ ఎడిటర్ గా ఉన్నారు. సమకాలీన
ఘటనలపై విశ్లేషణలు చేయడంలో అమర్ అందెవేసిన చేయి. సాక్షి టెలివిజన్ కన్సల్టింగ్
ఎడిటర్ హోదాలో నిర్వహించిన 'ఫోర్త్ ఎస్టేట్ ' చర్చాకార్యక్రమం ప్రజాదరణ పొందింది.
అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో, నవ్యాంధ్ర ప్రదేశ్ లో ప్రెస్ అకాడమీ
చైర్మన్, జాతీయ మీడియా సలహాదారుగా క్యాబినెట్ హోదా పదవులను కూడా నిర్వహించారు.
దేశంలో జర్నలిస్టుల అతిపెద్ద ట్రేడ్ యూనియన్ ఐ జె యు అధ్యక్షుడుగా , భారత ప్రెస్ కౌన్సిల్
సభ్యుడుగా పనిచేసిన అమర్ అమెరికా, నేపాల్, పాకిస్థాన్ లో పర్యటించారు. హైదరాబాద్
ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా, అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. 'డేట్ లైన్ హైదరాబాద్'
శీర్షికన ఆయన వారం వారం రాసే కాలం వివిధ పత్రికలలో ప్రచురితమైంది. ఆ వ్యాసాల
సంకలనం 'డేట్ లైన్ హైదరాబాద్' తో పాటు రూపా పబ్లికేషన్స్ వారి 'పవర్ ప్లే' , మూడు దారులు,
'సూటి మాట' పుస్తకాలు ప్రచురితమయ్యాయి. మరో రెండు పుస్తకాలు ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *