గురువులందరికీ వందనం

గురుర్బ్రహ్మ గురుర్విಷ್ಣುః గురుర్దేవో మహేశ్వరఃగురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

        నేడు బుధవారం  గురు పౌర్ణమి గురువులకు కృతజ్ఞతలు తెలియజేసే పర్వం . మహాభారతాన్ని రచించిన వ్యాస పూర్ణమిగా వ్యవహరిస్తారు.  ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమిని పర్వదినంగా నిర్వహిస్తారు.  సాధారణంగా శివ పరమాత్మను ఆది గురువుగా భావిస్తారు.  గురుపూర్ణిమనాడు మనకు  ఆధ్యాత్మిక కాంతులు అందించిన మహనీయులకు కృతజ్ఞతలు అందిస్తాము. గురువు వ్యక్తుల ఆంతరంగిక ప్రవర్తనని,  బాహ్య ప్రవర్తనను సంస్కారవంతంగా తీర్చిదిద్దేందుకు పరిశ్రమిస్తారు.  గురువు ఒక సహస్ర కాంతి ప్రపంచాన్ని జ్ఞానవంతంగా చేసేందుకు నిరంతరం మీద సుగుణాల ద్వారా మంచి నడకకు,  నడతకి బాట వేస్తారు ఒక విధంగా గురువు అనే పదం శక్తివంతమైనది ఉషస్సు నిశీధి నీడలను చీల్చిన విధంగా వ్యక్తులలో అహం,  అజ్ఞానం పారద్రోలి వినయ సంస్కార సంపదలను అందిస్తారు.  వ్యాసుడి నుంచి వాల్మీకి వరకు రచనల ద్వారా అన్ని తరాలకు వాఞ్మయం  ద్వారా విలువైన భావ సంపద ద్వారా సుగుణాల సంపదను సమకూర్చి అందించారు. 
     ప్రతిభ గలవారు ఎక్కడ ఉన్నా రాణిస్తారు కెరటం ఎంత కిందకి పడినా తిరిగి ఆకాశమంత ఎత్తుకి ఎగురుతుంది జీవనంలో కష్టసుఖాలు సహజం గురువులలో కేవలం జ్ఞాన సంపద కాకుండా మానవీయ విలువలు దాగి ఉండాలి గురువు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ వలె వేదాంతతత్వం , విద్య రెండు నేత్రాలుగా ఉండాలి.  గురువుకి మానవత,  అందరి శ్రేయస్సు ఆకాంక్షించే తత్వం ఉండాలి.  ఈనాడు సమాజంలో వివిధ రంగాలలో రాణిస్తున్న శిష్యులందరినీ తీర్చిదిద్దిన గురువర్యులు అందరికీ గురుపూర్ణిమ సందర్భంగా వందనం.  గురుపూర్ణిమనాడు సాయిబాబా ఆలయాలు భక్తజన సందోహంతో నిండి ఉంటాయి గురువు అంటే అమృత బంధం.  గురువు అంటే సహృదయం.  గురువు అంటే నిర్మల మనస్తత్వం   

–డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ
పరిశోధకులు, మొబైల్: 99490 39175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *