
తెలుగు సినిమా సృజన దిశగా వెడుతోంది. నవతరం దర్శకులు విభిన్నమైన జోనర్ కథలను ఎంపిక చేసుకోవడం ఇందుకు నిదర్శనం. మేర్లపాక గాంధీ గతంలో దర్శకత్వం వహించిన 'రన్ రాజా రన్' వినోదం అందించింది. తాజాగా విడుదలైన 'కొరియన్ కనకరాజు ' ప్రారంభం నుంచి చివరివరకు ప్రేక్షకులకు నచ్చే విధంగా బలమైన స్క్రీన్ రూపకల్పన చేశారు చిత్రం రాయలసీమ, కొరియా నేపథ్యంలో జరుగుతుంది సినిమా సన్నివేశాలు ఎక్కడా విసుగు కలిగించకుండా దర్శకుడు తన ప్రతిభని ప్రదర్శించారు కనకరాజు పాత్ర సరదా సరదాగా ఉండే పాత్ర. అతనికి సహాయకుడిగా సత్య పాత్ర ఉంటుంది అనుకోకుండా జరిగిన సంఘటన వలన కొరియా వ్యక్తి ఆత్మ కథానాయకుడు కనకరాజులో ప్రవేశిస్తుంది అక్కడి నుంచి కథ , కథనాలు మలుపు తిరుగుతాయి. చివరికి కథ ఏ దశకు చేరింది అన్నది వెండితెర మీద చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ముకుంద, గద్దలకొండ గణేష్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందిన వరుణ్ తేజ్ కనకరాజు పాత్రలో కనిపించి రెండు విభిన్నమైన కోణాలలో ప్రేక్షకులను మెప్పించారు. కిష్టప్పగా సత్య నవ్వులు పండించారు. మిరాయి చిత్రం ద్వారా యువప్రాక్షకుల ఆదరణ పొందిన రితికా నాయక్ అభినయం ప్రశంసలు పొందేలా ఉంది చిత్రంలో మురళిధర్ గౌడ్ జ్యోతిష్కుడుగా కీలకపాత్రలో కనపడ్డారు కథ అవసరం దృష్ట్యా విదేశీ నటులు ఉన్నారు. వరుణ్ తేజ్ కు హిట్ లభించింది. దర్శకులు ముగింపు దృశ్యాలని గ్రాఫిక్స్ సహాయంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా చిత్రీకరించారు. అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రలో కనబడ్డారు. తమన్ సంగీతం, పాటలు జనరంజకంగా ఉన్నాయి. లాజిక్ తో సంబంధం లేకుండా హాయిగా రెండున్నర గంటలు ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం కొరియన్ కనకరాజు చేశారు. చిత్ర బృందానికి అభినందనలు.
--డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ , సినీ పరిశోధకులు, 99490, 39175





