కాప్రా సర్కిల్ లో ఘనంగా జెండా పండగ

ఎనభయ్యవ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్కాజ్ గిరి కార్పొరేషన్ పరిధిలోని 
కాప్రా సర్కిల్, సైనిక్ పురి ప్రాంతాలలోని పలు కాలనీలలో, పాఠశాలల్లో వేడుకలు ఘనంగా
జరిగాయి. పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులు భరత మాత, దేశ నాయకుల డ్రెస్ లో రావడం
ప్రత్యేక ఆకర్షణ. విద్యుత్ బోర్డు తదితర ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు పతాకావిష్కరణ చేశారు.
కాప్రా సర్కిల్ లోని ఏ. ఎస్. రావు నగర్, దమ్మాయిగూడ , పద్మశాలి టౌన్షిప్, అరుళ్ కాలనీ,
నేతాజీ నగర్, మార్కండేయ నగర్ తదితర కాలనీలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఘనంగా జరిగాయి. శ్రీనివాస నగర్ కాలనీలో అధ్యక్షుడు ఎం. వి. ఎస్.ఎస్. సత్యనారాయణ (నాగు),
మార్కండేయనగర్ లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారు కాట్రగడ్డ శంకర్ బాబు,
మార్కండేయ భవనంలో కాప్రా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ధార్న మల్లయ్య త్రివర్ణ
పతాకాన్ని ఎగురవేశారు. కాప్రా ప్రెస్ క్లబ్ లో అధ్యక్షుడు మెరుగు చంద్ర మోహన్ పతాకావిష్కరణ చేశారు.
మీర్పేట్ లయన్స్ క్లబ్ లో సభ్యులు పతాకావిష్కరణ జరిపారు.

టౌన్షిప్ లో పతాకావిష్కరణ

కాప్రా సర్కిల్ దమ్మాయిగూడాలోని పద్మశాలి టౌన్షిప్ లో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఘనంగా జరిగాయి. టౌన్షిప్ లో అన్నివర్గాలకు చెందిన కుటుంబాల వారు సంబరాలు జరుపుకున్నారు.
పద్మశాలి టౌన్షిప్ అధ్యక్షులు శ్రీ సీతా ఆంజనేయులు, భావనారుషి సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీమతి యేముల దీప పతాకావిష్కరణ చేశారు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *