కేవైసీ మోసం పట్ల జాగ్రత్తగా ఉండండి
“మీ KYCని అప్‌డేట్ చేయండి, లేకపోతే మీ బ్యాంకు ఖాతా బ్లాక్ చేయబడుతుంది” అనే సందేశం మీకు వచ్చిందా?
భయపడకండి – ఇది ఒక మోసం! క్లిక్ చేసే ముందు ఆలోచించండి.
మోసగాళ్లు నకిలీ అత్యవసర పరిస్థితులను సృష్టిస్తారు.
ఈ క్రింది మూడు నియమాలతో వారిని వారి ఆటలోనే ఓడించండి:
- ఆగండి: తొందరపడి చర్య తీసుకోకండి!
- ఆలోచించండి: బ్యాంకులు/NBFCలు KYC (కేవైసీ) అప్‌డేట్ కోసం ఎప్పుడూ లింకులు పంపవు.
- చర్య తీసుకోండి: అలాంటి లింకులపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. అలాగే మీ OTP, PIN, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎల్లప్పుడూ మీ బ్యాంక్/NBFCను సంప్రదించండి.
తెలియని లింక్ = తెలియని ప్రమాదం!
మరిన్ని వివరాల కోసం: https://m.rbi.org.in/FinancialEducation/
ఆర్‌బీఐ అంటుంది – విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి!




