
ప్రేమ అంశాలు ప్రధానంగా దర్శకులు శివనిర్మాణ 'మజిలీ', 'నిన్నుకోరి' , 'ఖుషీ' చిత్రాలని తెరమీద అందించారు ఈసారి అందుకు భిన్నంగా సమాజంలో పసిపాపలపై, విద్యార్థినులపై జరుగుతున్న దారుణాలని ప్రధాన అంశంగా ఇరుముడి చిత్రానికి తండ్రి కూతుర్ల భావోద్వేగాలని భక్తి రస భావాలను జతచేసి తెరమీద దృశ్యాలని నడిపించారు దక్షిణ భారతదేశంలో అయ్యప్ప దీక్షలు తీసుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. సినీ ప్రముఖుల నుంచి సాధారణ పౌరులు వరకు 41 రోజుల దీక్షని స్వీకరిస్తారు. ఈ భక్తి సెంటిమెంటును దర్శకులు బాగా సినీ కథనంలో ప్రచారంలో ఉపయోగించుకున్నారు సమీక్షా ధర్మం దృష్ట్యా కథను ప్రస్తావించడం లేదు చిత్రకథంతా పరిమిత పాత్రల చుట్టూ తిరుగుతుంది. రవితేజ, నక్షత్ర తండ్రి కూతుర్లుగా అనుబంధాలని ఆత్మీయతలని బాగా పండించారు కథానాయికగా ప్రియా భవాని శంకర్ చాలా బాగా అభినయించారు చిత్రమంతా కొత్తదనంతో కథను మలుపులు తిప్పి ప్రేక్షకులను ఆకర్షించాలన్న తపన దర్శకుడిలో కనిపించింది. నిజంగానే ప్రేక్షకులు ఎవరూ ఊహించిన విధంగా సన్నివేశాలు కనబడతాయి చివరికు కథ విషాదాంతమవుతుంది. చిత్రంలో అందరినీ ఆకర్షించే విధంగా నక్షత్ర పాత్రని తీర్చిదిద్దారు దర్శకుడు. భద్ర, విక్రమార్కుడు వంటి చిత్రాలలో ఇలాంటి పాత్రను పోషించిన రవితేజ తనదైన ముద్రవేశారు. గురుస్వామి పాత్రను ఉన్నతంగా ప్రదర్శించి చివరికి ప్రతి నాయకుడిగా ముగించారు. గురుస్వామిగా సాయికుమార్ నటించారు. సమాజంలో అందరూ గౌరవించే వృత్తులు ఉపాధ్యాయ వృత్తి , ప్రజాప్రతినిధులు. ఆ పాత్రని ప్రతినాయక భావాలతో, ప్రతికూల అంశాలతో చిత్రీకరించడం సమంజసంగా లేదు. చిత్రంలో కథానాయకుడిని ఒక వ్యసనపరుడిగా, తాగుబోతుగా ప్రదర్శించడం ప్రేక్షకులకి నచ్చలేదు. పాటలు కొన్ని బాగున్నాయి. చిత్రం ముగింపు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ప్రేక్షకులు నిజంగానే దృశ్యాలని వీక్షించినప్పుడు ఆర్ద్రతకు గురవుతారు. చిత్రం అంతా సీలేరు ప్రాంతంలో చిత్రీకరించారు . ఒకరకంగా కుటుంబ సన్నివేశాలు సస్పెన్స్, భక్తి అన్నీ ఉన్నాయి కోపం ప్రేమ విషాదం భయం తెరమీద మెరిశాయి. ఇరుముడి చిత్ర దర్శకులకి అభినందనలు.
— డాక్టర్ డి.వి.ఎస్.ఎస్. శర్మ , పరిశోధకులు , 99490 39175.







