మన సంప్రదాయాలు, సంస్కృతికి పట్టంకట్టే ఓనం

      క్షిణ భారతదేశం సంప్రదాయాలకు ,  సంస్కృతికి కేంద్రంగా ఉంది.  దక్షిణాది రాష్ట్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, పుదుచ్చేరిలో మాట్లాడే  భాష ఏదైనా ఆచరించే వేడుకలు ఒక్కొక్కసారి ఒకేలా అనిపించడం విశేషం.  మన ప్రాంతీయ ఆచారాలు అనాదికాలం నుంచి వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా  వస్తోంది. మనందరికీ కేరళం పేరు  వినగానే పచ్చదనంతో  పలకరించే అందమైన ప్రకృతి జతగా కొబ్బరి తోటలు, జలపాతాలు, పుణ్యక్షేత్రాలు  అంతే కాకుండా వేడుకగా జరిపే ఓనం  పండుగ .  ఈ పర్వం పది రోజులు పాటు సాగుతుంది.   కేవలం కేరళ రాష్ట్రంలోనే కాకుండా మలయాళీలు నివసించే  ప్రాంతానికి  ఓనం కదిలి వస్తుంది తెలుగునాట సంక్రాంతి పండుగకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఓనం కూడా అంతే కీలకంగా ఉంటుంది.   రాష్ట్రం, దేశం ఏదైనా
మలయాళ సోదర సోదరీమణులు ఉన్నచోట ఖచ్చితంగా ఈ పండుగను నిర్వహిస్తారు.  
       ప్రతి పండుగకు ఒక నేపధ్యం ఉంటుంది. అది తరతరాలుగా కొనసాగుతోంది. మలయాళ క్యాలెండర్ ప్రకారం (ఆగస్టు – సెప్టెంబర్) ‘చింగమ్’ మాసంలో  ఈ పండుగ వస్తుంది.   మనుష్యులు ఎంత ఎదిగిన ఒదిగి ఉండవలసిందే. భగవంతుని సంకల్పం ముందు అందరూ తలవంత్సల్సిందే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.  బలి చక్రవర్తి ఆధిపత్యాన్ని తగ్గించడానికి వామనుడు వస్తాడు. మూడు అడుగుల చోటు అడిగి తన మూడవ పాదాన్ని మోపడం ద్వారా బలిని పాతాళానికి .పంపుతాడు. ప్రతి సంవత్సరం భూమి కి తిరిగి వచ్చి తన ప్రజలను చూసుకునే వరాన్ని బలి పొందాడు. బలి రాకను కేరళ ప్రజలు స్వాగతించి ఓనంగా  వేడుకలు చేసుకోవడం సంప్రదాయంగా మారింది  ఓనం పండగ అనగానే రెండే రెండు గుర్తుకు  వస్తాయి.   ప్రతి ఇంటిని అందంగా అలంకరించడం.  అంతేకాదు ప్రతి ఒక్కరికి  జిహ్వా చాపల్యం తీరే విధంగా పిండి వంటలు చేయడం. కేరళ వాసులు శ్వేత వస్త్రాలతో అందంగా  మెరిసి అలరిస్తారు. కేరళలో ఓనం పండుగను మరింతగా గుర్తు చేసేవి పడవల పోటీలు ఇది చాలా వైభవంగా జరుగుతాయి చాలా తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో పలకరించాయి ఏనుగుల పోటీలు, సంగీత సాహిత్యాలు ప్రతిభా ప్రదర్శనలు అందరినీ అలరించడం ఓనం పండగ ప్రత్యేకతలు. ఓనం ఒక్క ప్రాంతానికి పరిమితం కాదు నైరాశ్యాన్ని నిస్పృహలని వదిలించి కొత్త జీవనానికి, ఉత్సాహానికి భావోద్వేగాలకు ఓనం పండుగ నాంది పలుకుతుంది. ఓనం  పండుగను కేరళం ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరుపుకుంటుంది. మలయాళీ సోదర సోదరీమణులందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు
— డాక్టర్ దువ్వూరి శర్మ, అధ్యాపకులు , 9949039175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *