

ఏటేటా జరుపుకునే వినాయక నవరాత్రులఉత్సవాలసందర్బంగా రకరకాల ఆకృతులలో వినాయక విగ్రహాలను తయారుచేసిజంటనగరాల చుట్టుపక్కల ఉన్న చెరువులలో నిమజ్జనం చేస్తూ వస్తున్నాం. దానివల్ల అవన్నీ కలుషితం అవుతున్నాయి. దానిని దృష్టిలో ఉంచుకొని గత కొద్ది సంవత్సరాలుగా పర్యావరణ హితమైన మట్టి వినాయకులను పూజలో ఉపయోగించవలసిందిగా పలు స్వచ్ఛంధ సంఘాలు ప్రజలను కోరుతున్నాయి. ఫలితంగా మట్టి గణపతులు వినియోగం పెరిగింది. పలువురు దాతలు ముందుకు వచ్చి ఉచితంగా విగ్రహాలను పంపిణీ చేయడం హర్షించదగిన పరిణామం. ఈ నేపథ్యంలో మాధవపురి కాలనీకి చెందిన కృష్ణ కంటే & సువర్ణకమల దంపతులు కాలనీకి చెందిన శ్రీ రామ వినాయక ఉత్సవ కమిటీ సమన్వయంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయాలని సంకల్పించారని ఉత్సవకమిటీ చైర్మన్ రవిసీతారాం తెలియజేశారు.





