
కాప్రా సర్కిల్ లోని మాధవపురి కాలనీ నివాసులందరికీ ఉచితంగా పర్యావరణ హితమైన
వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. శ్రీమతి & శ్రీ కృష్ణ కంటే – సువర్ణ కమల ఇందుకు
ఆర్హిక సహకారం అందించారు. ఆదివారం సాయంత్రం జరిగిన మట్టి వినాయక విగ్రహాల
పంపిణీని రిటైర్డ్ కల్నల్ ఎల్. ఎస్. ఎన్. మూర్తి ప్రారంభించారు. కాలనీ నివాసులు పూజకు,
ఇతర కార్యక్రమాలకు పెద్దఎత్తున విరాళాలు ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం.
వారం రోజుల పూజకు ఏర్పాట్లు
శ్రీ రామ వినాయక ఉత్సవ కమిటీ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతి రోజు పూజ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం , విద్యార్థులకు ఆర్ధిక సహాయం, శుక్రవారం 18వ తేదీన మాధవపురి లలితా గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ లలితా పారాయణం, సినిమా సన్నివేశాలు, పాటల పోటీ , రానున్న చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని పేదలకు దుప్పట్ల పంపిణీ. ఉంటాయి. 19వ తేదీ శనివారం కాలనీ బాలలు, యువత నృత్య ప్రదర్శన. ఆదివారం 20వ తేదీన అన్న ప్రసాద వితరణ, ఉట్టి, నిమజ్జనం ఉంటాయని ఉత్సవ పర్యవేక్షణ కమిటీ తెలిపింది.









