సకలసిద్ధి ప్రదాత అయినవిల్లి వినాయకుడు

    గోదావరి తీరం  ఆధ్యాత్మిక వైభవం గల ప్రాంతం.  పంచారామాలలో నాలుగు పంచారామాలు,  సప్తగిరిపై వెలసిన సత్యదేవుడు అందరికీ ఆరాధ్య దైవాలు.  మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా  అవన్నీ జయప్రదంగా జరగాలి అంటే వినాయకుడి ఆశీస్సులు అవసరం.  సాధారణంగా గణపతి అనగానే తెలుగు వారందరికీ స్మరణకు వచ్చేది గోదావరి తీరంలో గల అయినవిల్లి క్షేత్రం తిరుపతి సమీపంలో కాణిపాకం క్షేత్రం ఖచ్చితంగా మదిలో మెదులుతాయి.  అయినవిల్లి సిద్ధి వినాయకుడిని వ్యాస మహర్షి  ప్రతిష్టించారని ఒక నానుడి.  స్వయంభువుగా గణపతి అందరి చేత పూజలు అందుకోవడం విశేషం ఇతిహాసాల కాలం నుంచి దేవాలయానికి ప్రాధాన్యత 
ఉంది. సంచలనం కలిగించిన దక్షయజ్ఞానికి ముందే దక్షుడు పూజించారని చెప్పడం విశేషం అయినవిల్లి దేవాలయంలో ప్రతినిత్యం ఉదయం గణపతి హోమం నిర్వహిస్తారు అంతే కాదు స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతుంది వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పూజా జరుగుతుంది. ప్రతినెలా వచ్చే సంకట చతుర్దశి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు . ఆ తర్వాత విద్యార్థులకు కలాలు పంచుతారు అయినవిల్లి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఉంది . గణపతి నవరాత్రులు ఘనంగా చేస్తారు నిత్య అన్నదాన పథకం, భక్తుల కోసం వసతి గృహాలు ఉన్నాయి. ఆలయం భక్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది విరామ సమయంలో కూడా కటకటాల నుంచి దర్శించుకోవచ్చు అందరి కోర్కెలని కేవలం నారికేళం ద్వారా నెరవేర్చే గణపతి ఆశీస్సులు అందరికీ వరం కావాలి . కేవలం తెలుగు వారే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలవారు కూడా స్వామిని దర్శించుకుంటారు. గణపతిని ఈ ప్రాంతంలో ఉండే ప్రజా నాయకులు ప్రజలే కాకుండా సుప్రసిద్ధ సినిమా తారలు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి మంత్రులు అందరూ సందర్శించుకోవడం విశేషం ఈ వినాయక చవితి పర్వదినాన గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిద్దాం. -- డాక్టర్ దువ్వూరి శర్మ , అధ్యాపకులు, 9949039175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *