మట్టి గణపతి — మహా గణపతి

కాప్రా సర్కిల్ లోని నివాస కాలనీలలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.
ఒక్కొక్క కాలనీలో గణపతి విగ్రహాల ఉద్వాసన గత మూడు రోజులుగా ఊపందుకుంది.
కాగా ఈ సంవత్సరం పర్యావరణ హితమైన (ఎకో ఫ్రెండ్లీ) గణపతులను ఎక్కువగా ప్రతిష్టిస్తున్నారు.
దానికి తోడు పలు స్వచ్ఛంధ సంస్థలు, వ్యాపార సంస్థలు మట్టి గణపతులను పంచడం ఈ
సంవత్సరం ప్రత్యేకత. ఈశ్వరపురి కాలనీలోని హరిహర క్షేత్రంలో కూడా మట్టి గణపతిని
ప్రతిష్టించి ఉదయం,సాయంత్రం ఘనంగా పూజలు చేస్తున్నారు. గణపతి ఉద్వాసన
బుధవారం 23వ తేదీన జరుగుతుంది.

శ్రీవారి వార్షిక పవిత్రోత్సవం
కాగా ఈశ్వరపురి కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం 25వ
తేదీ నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు జరుగుతాయి. పవిత్రారోహణ
మహోత్సవము తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు వైభవంగా నిర్వహిస్తారని
25వ తేదీన ఆ అంకురారోపణం, 26వతేదీన చతుర్దశ కలశ స్నాపనము, విశేష తిరుమంజనం,
పవిత్ర సమర్పణ సాయంత్రం తిరువీధి ఉత్సం ఉంటాయి. 27వ తేదీన శుక్రవారం
మహా పూర్ణాహుతి, ప్రధాన కుంభ ఆలయ ప్రదక్షణం, ఉదయం 11 నుంచి మ. 1.00 గంట వరకు
శ్రీవారి కళ్యాణం ఉంటాయి.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *