
కోనసీమ అభివృద్ధికి స్వర్గీయ గంటి మోహనచంద్ర బాలయోగి బాటలువేశారు. బాలయోగి పేరు వినగానే అందరికీ ఇద్దరు మహనీయులు స్మరణకి వస్తారు ఇద్దరు ముమ్మిడివరం ప్రాంతానికి చెందినవారు కావడం విశేషం. ఒకరు తపోధనులు బాలయోగీశ్వరులు. మరొకరు నిరాడంబర సేవాపరులు ప్రజాసేవని తన విధి శ్వాస వరకు కొనసాగించిన నాయకులు మోహనచంద్ర బాలయోగి. ఆయన 1951 అక్టోబర్ ఒకటో తారీకున ఎదురులంక గ్రామంలో జన్మించారు. బాలయోగి విద్యావంతులు న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎన్ఠీఆర్ ఆయనను ప్రథమంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక అభ్యర్థిగా ఎంపిక చేశారు . అమలాపురం ఎంపీగా 1991 1998 1999లో మంచి విజయం సాధించారు. బాలయోగి చాలా అదృష్టవంతులు 1994లో ముమ్మిడివరం నుంచి పరాజయం పొందినప్పటికీ మరల 1996 ఉప ఎన్నికల్లో గెలిచి విద్యామంత్రి పదవిని చేపట్టారు. విద్యారంగంలో సంస్కరణలు తెచ్చారు. ఇంటర్మీడియట్ పరీక్షలలో సంస్కరణలకు ఆనాడే నాంది పలికారు. ఇంటర్మీడియట్ విద్యను సమూలంగా సంస్కరించారు. 1998 – 2002 మధ్య లోక్ సభపతిగా ఎన్నిక కావడం తెలుగు వారందరికీ గర్వకారణం. నీలం సంజీవరెడ్డి తర్వాత ఆ ఖ్యాతి ఆయనకే దక్కింది. కోనసీమ అభివృద్ధికి చాలా కృషి చేశారు. దీవివలె లో ఉన్న ప్రాంతానికి ఎదురులంక చించినాడ వంతెన నిర్మించారు . అలాగే రైల్వే లైను లేకపోయినా రైల్వే రిజర్వేషన్ కార్యాలయం ఏర్పాటు చేశారు . మృదుస్వభావి. అందరినీ చిరునవ్వుతో పలకరించే సహృదయ వ్యక్తిత్వం ఆయనది. తెలుగువారు ఎవరైనా దేశ రాజధాని ఢిల్లీ వెళ్లినా ఆదరించేవారు బాలయోగిని అన్ని పార్టీల వారు ఆత్మీయుడుగా భావించేవారు. అభివృద్ధి ప్రదాత బాలయోగి జయంతి అక్టోబర్ 1. కోనసీమకు రైలు రావాలని ఆకాంక్షించేవారు. బాలయోగి మన మధ్య లేకున్నా వారి తనయుడు అమలాపురం ఎంపీ హరీష్ కోనసీమ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయం
— డాక్టర్ దువ్వూరి శర్మ, అధ్యాపకులు, 9949039175





