12 నుండి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భ్ణగా నిర్వహించే వాహన సేవలను వీక్షించి ఆధ్యాత్మిక అనుభూతి ఆస్వాదించేందుకు భక్తులు తరలివస్తారు. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవు. ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబరు 11 అంకురార్పణం, 12న ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం సేవలు నిర్వహిస్తారు. అక్టోబరు 13న ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం, 14న ఉదయం 8 గంటలకు సింహ వాహనం , రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనం, 15 ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం, 16న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనం, 17న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానం, రాత్రి 7 గంటలకు గజ వాహనం, 18న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం, 19 న ఉదయం 7 గంటలకు స్వర్ణరథం రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం, 20న ఉదయం 6 గంటలకు చక్రస్నానంతో ఉత్సవాలు నిర్వహిస్తున్న టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ముందుగా సమీక్ష నిర్వహించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో వరుస సెలవుల నేపథ్యంలో గతంతో పోలిస్తే సుమారు 25 నుంచి 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం అధికారులు అంచనా వేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని, వాహన సేవలను వీక్షిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడానికి వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. —-వి ఆర్ ఎం.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *