
గోవాలో గురువారం తెల్లవారుజామున కన్నుమూసిన నానాపటేకర్ ((1951-2026) అంత్యక్రియలు పూణేలోని ఆయన ఫామ్ హౌస్ లో గురువారం రాత్రి జరిగాయి.
ప్రపంచ వేదికపై హిందీ సినిమాకు గుర్తింపు హిందీ సినిమాకి గుర్తింపు లభించింది భారతీయ సినిమా వందేళ్ళ ప్రస్థానంలో ఎందరో ప్రతిభగల దర్శకులు, నటులు తమ ప్రతిభ ద్వారా వెండితెరకి వరంగా నిలిచారు. పృద్వీ రాజ్ కపూర్ నుంచి అనిల్ కపూర్ వరకు, నర్గీస్ నుంచి శ్రీదేవి , కాజోల్ ఇలా నటన ద్వారా భావోద్వేగాల కథలకు ఊపిరి పోశారు. షోలే, మిస్టర్ ఇండియా, చాందిని, మైనే ప్యార్ కియా, లగాన్ ఇలా వైవిధ్య కథలు, కథనాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. హిందీ సినిమా కథలలో భావుకత కాకుండా సమర్ధవంతమైన అభినయం వ్యక్తం చేసే నటులకు కొదవలేదు. అమ్రీష్ పూరి, పరేష్ రావల్, అర్షద్ వార్సీ , ప్రాణ్ వంటి వారు అందరూ తన్మయత్వపరిచే నటనను సమర్పించారు. ఇప్పటి తరంలో నానాపటేకర్ చిరస్మరణీయమైన ముద్రవేశారు. నటన అనేది ఒక రకమైన మెథడాలజీ . అది అందరూ సహజంగా సమర్పించలేరు. నానా పటేకర్ అనగానే అతిశయాలకి, ఆడంబరాలకి, ఆర్భాటాలకి దూరంగా ఉండే నటన కనుల ముందు కదులుతుంది. ఒక కథ కథనం భావోద్వేగాలు ఇవన్నీ ప్రేక్షకులకి చేరువ కావాలి అంటే అది నానాపటేకర్ వంటి వారి వలన సాధ్యపడుతుంది. నానాపటేకర్ నటన నవరసాలను ఆవిష్కరించింది. హాస్యాన్ని, విచారాన్ని, కోపాన్ని అసూయను, , విషాదాన్ని సంతోషాన్ని సమంగా పంచింది. పరిందా , అగ్నిసాక్షి, క్రాంతివీర్ చిత్రాలు అసమానమైన ఆయన నటనకు గీటురాయిగా నిలబెట్టాయి. అవార్డుల ఆభరణాలని పంచాయి. హిందీ సినిమా చరిత్రలో నానా ఒక పేజీగా మిగిలిపోతారు. నాటక రంగం నుండి రావడం వలన అభినయం శైలిలో ఆయన సంతకం కనిపిస్తుంది. దక్షిణాదిన తన హిందీ సినిమాల ద్వారా దగ్గరైన నానాపటేకర్ కాలా చిత్రం ద్వారా అందరికీ మరింత సన్నిహితులయ్యారు. పద్మశ్రీ పురస్కారం పొందిన అభినయం ఎప్పటికీ పరిమళిస్తూ ఉంటుంది. సినిమాలలో పాత్రల ద్వారా ఎప్పటికీ నానా పటేకర్ అమరజీవి. నానాపటేకర్ కు అక్షరాంజలి.
–డాక్టర్ దువ్వూరి శర్మ , పరిశోధకులు, 99490 39175 .





