ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ వైభవం


మన సంస్కృతి వారసత్వం వైభవంగా ఉండడమే కాకుండా తరం నుంచి తరానికి ప్రయాణించడం విశేషం. అమ్మవారిని విపరీతంగా ఆరాధించే ఆధ్యాత్మికతలో కేవలం నవరాత్రులు ఒకటే కాదు ప్రాంతీయ సంస్కృతిలో పండగలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం గమనార్హం. బతుకమ్మ పండగ అనగానే తెలంగాణ ప్రాంతం స్మరణకి వస్తుంది . ఇది ప్రకృతిని పూజించే పండుగ. ప్రకృతిని ప్రతివారు గౌరవించాల్సిన స్థితి ఉంది. ప్రకృతి కరుణించినప్పుడు అన్ని సమంగా వికసిస్తాయి. అది ఎండ, వర్షం, శీతలం ఎలాంటి వైపరీత్యాలు లేకుండా పలకరిస్తాయి . అందుకే గోపాల బాలుడి నుంచి అందరూ ప్రకృతికి వందనం చేస్తారు. బతుకమ్మ పండగ భాద్రపద అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు సందడి అడుగులు వేస్తుంది సుమాల గోపురం మీద గౌరమ్మను ఉంచి పూజిస్తారు.
ప్రతీ పండగలకి దేవతలను నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ సాధారణంగా తెలుగు నేలపై అమ్మవారి నుంచి గ్రామదేవతల వరకు తమ ప్రేమకి గుర్తుగా నివేదిస్తారు తెలంగాణలో బతుకమ్మకి నైవేద్యాలు ఒక్కరోజు తప్ప అన్ని రోజులు సమర్పిస్తారు. కేవలం తెలంగాణలోనే కాకుండా ఆంధ్రావనిలో కూడా బతుకమ్మ పండుగ నిర్వహించడం బతుకమ్మ పండుగ మన సంప్రదాయానికి చిరునామా బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు.
–డాక్టర్ దువ్వూరి శర్మ. పరిశోధకులు, 99490 39175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *