కొత్త దారిన నడిచిన త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’

 సినీ పరిశ్రమలో నవతరం దర్శకులలో త్రివిక్రమ్ కు ఓ ప్రత్యేకత ఉంది మానవ సంబంధాలు, ఆత్మీయత,  అనురాగాలు జతగా నిండుగా అందించే సంస్కారంతో హాస్యం ఇవన్నీ కనబడతాయి.  నువ్వే నువ్వే నుంచి గుంటూరు కారం వరకు ప్రేక్షకులను పలకరించిన దృశ్యాలు చిన్నితెరపై ఎవర్ గ్రీన్ గా కనబడుతూ ఉంటాయి.  తాజాగా విడుదలైన ఆదర్శ కుటుంబం   చిత్రం ప్రారంభం నుంచి  దర్శకుడి కొత్త ప్రయత్నం ప్రతిబింభించింది. ఇటీవలి సినిమాలన్నీ యాక్షన్ ప్రధానంగా వస్తున్నాయి. ఈ దర్శకుడు కూడా అదే వైఖరిని అనుసరించారు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే హాస్యం కుటుంబ పరమైన విలువలు దాగి ఉంటాయని ప్రేక్షకుల ఆశిస్తారు అందుకు భిన్నంగా కథాకథనాలు కనపడ్డాయి ప్రచార చిత్రాలలో, ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు. ఒక విధంగా చెప్పాలి అంటే వెంకటేష్ గత చిత్రం దృశ్యం ఛాయలు ఈ సినిమాలో కనిపించాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఆదర్శకుటుంబం పరిచయం నిజంగానే భార్యాభర్తలు, పిల్లలు వీరి మధ్య దృశ్యాలు సంభాషణలు మధ్యతరగతి వాతావరణాన్ని అందించాయి . అనుకోకుండా కథానాయకుడికి లాటరీ తగులుతుంది. ఆ తరువాత సన్నివేశాలు వేగంగా కదులుతాయి. అవన్నీ సినిమాలో చూస్తే ప్రేక్షకులకి ఆసక్తికరంగా ఉంటాయి ఇటీవల కాలంలో సినిమాలలో వస్తున్నా గ్యాంగ్ లు, వారి అకృత్యాలను త్రివిక్రమ్ తన శైలికి విరుద్ధంగా తీర్చిదిద్దారు. ప్రథమ భాగమంతా కుటుంబ పరమైన సన్నివేశాల వలన ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు. ద్వితీయ భాగమంతా సాధారణంగా ఉంది. కథానాయకుడికి తెలివితేటలు ఉంటాయి. త్రివిక్రమ్ సినిమాలలో సాధారణంగా భావోద్వేగాల పరమైన సన్నివేశాలు ఉంటాయి. అలాంటివ దృశ్యాలు ఈ సినిమాలో లేకపోవడం వెలితిగా అనిపించింది ఆదర్శ కుటుంబాన్ని బాంధవ్యాల పరంగా తెలిపే దృశ్యాలు ఉంటే బాగుండేది. మల్లీశ్వరి, దృశ్యం చిత్రాలలో ఈ విధమైన పాత్రలు చేసిన వెంకటేష్ బాగా నటించారు. శ్రీనిధి కథానాయికగా హుషారైన నటన కనబరిచారు. చాలాకాలం తర్వాత కీలకమైన పాత్రలో రఘుబాబు మెరిశారు . నారా రోహిత్ పోలీస్ అధికారిగా ప్రధాన పాత్రలో కనిపించారు. కోనసీమ ప్రాంతానికి చెందిన వర్ధమాన కళాకారుడు వడ్లమాని సాయి శ్రీనివాస్ ఈ చిత్రంలో నటించారు. తమన్ సంగీతం , రీ రికార్డింగ్ బాగున్నాయి.సంభాషణల బలం బావుంది త్రివిక్రమ్ బృందంలో నటుల అందరూ ఈ చిత్రంలో ఉన్నారు అయితే సినిమా చూశాక ప్రేక్షకులకి ఇది త్రివిక్రమ్ చిత్రమేనా అనే సందేహం కలుగుతుంది. ప్రేక్షకాదరణతో ఈ చిత్రం విజయం దిశగా నడుస్తోంది.

—- డాక్టర్ దువ్వూరి శర్మ, సినీ పరిశోధకులు, 99490 39175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *