
రామాయణ మహాకావ్యం , పాత్రలు భారతీయ సంస్కృతిలో భాగం. రాముని పాత్ర అందరికీ ఆదర్శం రామాయణం పై 1960 నుంచి నేటి వరకు తెలుగు హిందీ సినిమాలు, సీరియల్స్ వచ్చాయి ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్ఠీఆర్ రాముడిగా ప్రేక్షక హృదయాలపై ముద్రవేశారు. 1980 దశాబ్దంలో చిన్నితెరపై రామానంద్ సాగర్ రామాయణాన్ని బాగా పండించారు. బాపు, గుణశేఖర్ ఇద్దరూ రామాయణాన్ని అందంగా తెరమీద నడిపించారు ఇటీవల కాలంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన రామాయణం సినిమా నిర్మాణం చర్చకు దారితీసింది. నితీష్ తివారీ దర్శకత్వంలో ఉత్తరాది, దక్షిణాది తారలతో నిర్మించిన రామాయణం చిత్రం ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. దీపావళికి విడుదల కావల్సిన ఈ చిత్రం ముందే ప్రేక్షకుల తీర్పు కోరుతూ వచ్చింది . త్రీ-డి చిత్రం కావడం వలన ఒక దృశ్య కావ్యంలా ఉంది. గతంలో వచ్చిన చిత్రాలు కేవలం శ్రీ రాముడి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాయి అదేవిధంగా శూర్పణక పాత్ర పరిమితంగా ఉంటుంది. కానీ సినిమా సినీ కథనంలో ప్రత్యేకంగా ఒక కథని పరిచయం చేశారు ఒక రకంగా రావణాసురుడి పాత్ర ప్రతినాయకుడైనా శక్తివంతంగా తీర్చిదిద్దారు. విశ్వామిత్రుడి వెంట శ్రీరాముడు చేసిన సాహస దృశ్యాలు , పరాక్రమాలు మనసుకు బాగా చేరువచేశాయి. శివధనుస్సు సంధించిన తర్వాత సీతారాముల సంభాషణ ఇవన్నీ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయి . పరశురాముడు వాదన దృశ్యం అందరికీ విపరీతంగా నచ్చింది. ఈ దృశ్యాలు ఇదివరకు సినిమాల్లో అంతగా కనపడవు వనవాస దృశ్యాలు మనోహరంగా ఉన్నాయి ఈ చిత్రంలో సాధ్వి సీతాదేవిని యుద్ధ వనితగా ప్రదర్శించారు . అంజలీదేవి దీపికా తర్వాత సీత పాత్రను సాయిపల్లవి బాగా పండించారు కెమెరా ప్రతిభావంతంగా తెరమీద మెరిసింది. కథానాయకుడు రెండు పాత్రల్లో కనపడతారు రాముడిగా రణబీర్ కపూర్ నటించారు మన హైదరాబాద్ నివాసి రచయిత ఆకెళ్ళ రచన బలం తెలుగు అనువాదానికి జీవం పోసింది. నేటి జెన్-జీ తరం రామాయణం చిత్రాన్ని వీక్షించవలసిందే. ఇది తెరమీద కురిసిన దృశ్య అద్భుతం .
— డాక్టర్ దువ్వూరి శర్మ, సినీ పరిశోధకులు, 99490 39175





