నటశిఖరం గిరిబాబు

 తెలుగు సినిమా పరిశ్రమ ఒక మంచి నటుడ్ని శనివారం నాడు కోల్పోయింది . ఐదు దశాబ్దాలుగా  దర్శకుడిగా, నిర్మాతగా సినీరంగంలో  తన సృజనని కొనసాగించారు.  ఇటీవల కాలంలో వయస్సు రీత్యా నటనకు విరామం ఇచ్చారు.   1970-90 మధ్య కాలంలో వెండితెరపై ప్రభంజనం కొనసాగిన నటులలో గిరివాబు ఒకరు. అయన సినీరంగంలో తమదాయమా ముద్ర వేశారు  విలనిజం నీడగా హాస్యాన్ని పండించారు.  గిరిబాబు వాచకం, సంభాషణలు కొత్త తరహాగా ఉండేవి.  1980 దశాబ్దంలో కోడి రామకృష్ణ , రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో   హాస్య బృందంలో ఒకరిగా ఉండి రాణించారు .  

నవతరం దర్శకులు ప్రవేశం నాటికి మధ్య వయస్సులో ప్రవేశించిన గిరిబాబు తన పెద్దరికానికి తగిన విధంగా తండ్రి సోదరుడు పాత్రల ను పోషించారు. గిరిబాబు కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో ఇప్పటి తరానికి చేరువయ్యే పాత్రలో నటించారు గిరిబాబు ప్రతిభని సీనియర్ దర్శకులు గుర్తించారు. రఘ్వేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు వంటివారు కథాబలానికి అనుగుణంగా పాత్రలు ఇచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలలో హాస్య ప్రతినాయక పాత్రలు పోషించారు. సినీరంగంపై అభిమానంతో నిర్మాతగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా నట వారసుడిగా రఘుబాబు చేత అడుగులు వేయించారు గిరిబాబు అందరికీ ఆత్మీయులు వివాదాలకు దూరంగా సినిమా పరిశ్రమలో ప్రతి వారి అభిమానం పొందారు గిరిబాబు దూరమైన ఆయన నటించిన పాత్రల్లో చిరంజీవిగా నిలిచి ఉంటారు.

—డాక్టర్ దువ్వూరి శర్మ, సినీ పారిశ్ధకులు, 99490 39175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *