వెండితెరపై హస్యం కురిపించిన సంక్రాంతి చిత్రాలుఅనగనగా రాజు, నారీ నారీ నడుమ మురారీ, భర్త మహాశయులకి విజ్ఞప్తి.

ఈసారి సంక్రాంతి వెండితెర సందడి బాగా కనబడింది. రాజాసాబ్ చిత్రం నిరాశ కలిగించిన తరువాత సినిమాలు వరుసగా హస్య భావోద్వేగాలు, కథలు కలిసిన అంశాలు, సంక్రాంతి వంటలలా విభిన్న రుచులని అందించాయి. చిరంజీవి గారి సినిమా ఇప్పటికే సమీక్షించాను. భర్త మహాశయులకి విజ్ఞప్తి హస్య దర్శకుల కిశోర్ తిరుమల కథని సరిగా తెరమీద నడిపించడంలో అంచనాలుకి దూరంగా ఉన్నారు అన్న భావన కలిగింది. ఒక సాధారణ అంశాన్ని చివరి వరకు అన్న భావన కలిగింది. స్క్రీన్ ప్లే సరైన స్థాయిలో లేదన్న భావన అభిప్రాయం కలిగింది. రవితేజ పాత్ర హుషారుగా ఉన్నా మిగతా కథ కథనం సాదాసీదగా ఉంది. ఇద్దరి పాత్రల మధ్య భావోద్వేగాలు యింకా ఆసక్తికరంగా చిత్రీకరించవలసి ఉంది. దర్శకుల ఆలోచనలు అంతగా ప్రేక్షకుల స్పందనని ఇంకా పొందవలసింది. అయినా సంక్రాంతి రేసులో ఉంది. గాబట్టి ప్రేక్షకులు అందరూ చూశారు. కథానాయికిల పరంగా గ్లామర్ బాగా పండింది.

నవీన్ పోలిశెట్టి అనగానే కొత్త కథల సృజన స్మరణకి వస్తుంది.జాతిరత్నాలు చిత్రం ద్వారా యువ ప్రతిభ మెరిసింది. అప్పటి నుంచి నవీన్ సినిమాలు పై యువతరం ప్రేక్షకులుకి అభిమానం పెరిగింది. అనగనగా ఒకరాజు చిత్రం ప్రేక్షకులకి ఆనందాన్ని మిగిల్చింది. ప్రధమ భాగం అంతా చాలా చాలా ప్రశంసనీయంగా అనిపించింది. విశ్రాంతి తరువాత కథ, కథనాలు కొత్తదారిని అన్వేషించింది. సినిమా బాధ్యత సందేశం అన్న అభిప్రాయం దర్శకుడికి కనిపించింది. మీనాక్షి చౌదరి, నవీన్ రెండు నేత్రాలుగా సినిమాకి అనిపించారు. పాటలు చాలా బాగున్నాయి. నవీన్ కాస్ట్యూమ్స్ అన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి. నాగవంశీ, సౌజన్య నిర్మాతలుగా ఎప్పుడు అభిరుచికి అగ్రస్థానం యిస్తారు. సంక్రాంతి రేసులో ఈ చిత్రం విజేతగా నిలిచింది.

నారీవారీ నడుమ మురారి సంక్రాంతి రేసులో చివరిగా వచ్చిన శర్వానంద్ చిత్రం నారీ నారీ నడుమ మురారీ కథని దర్శకులు ఆసక్తికరంగా చివరి వరకు నడిపించారు. ఇద్దరు హిరోయిన్లు ఉన్నప్పుడు కథని ప్రేక్షకులు ఒకరకంగా ఊహించుకుంటారు. గానీ చాలా తెలివిగా దర్శకులు ప్రేక్షకులుకి ఏ విధమైన విసుగు లేకుండా సినిమాని ముగింపు సందేశం జతకలిపి సమర్పించారు. కథలో హస్యం, విలువలు బాగా పండాయి. సంయుక్త మీనన్ పాత్ర అతిధిగా అనిపించిన కీలకంగా ఉంది. సంక్రాంతి రేసులో అనుహ్యంగా విజయం సాధించింది.

Dr. D.V.S.Sarma Lecturer, Amalapuram.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *