ప్రేమ అనుభూతిని పంచే ‘ఒక రోజు’

సినిమా ఇప్పుడు ప్రజల భాష అయ్యింది. ప్రజల మనసుకి సంబంధించిన అంశాలకు తో కనెక్ట్ అయ్యింది. ఒక విధంగా అన్ని ఉద్వేగాలని తనలో దాచుకుంటుంది. సినీ కథలు సరిహద్దులు చెరిపివేసి సాన్నిహిత్యంగా మారాయి. భారతీయత అనేది పాన్ ఇండియాలో ప్రతిబింస్తోంది. ఉత్తరాది కథనాలు దక్షిణాది కథనాలు వెండితెరపై నడుస్తూ ప్రతిభను సమర్పిస్తున్నాయి. ఉత్తరాది తారల్లో సుపరిచితుడైన అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా, నవతరం ప్రేమ కథలకు సింబల్ గా మారిన సాయి పల్లవి కథానాయికగా నటించారు ఒక రోజు చిత్రంలో. ఫిదా, లవ్ స్టోరీ, తండేల్, అమరన్, శ్యాం సింగరాయ్ చిత్రాలలో తన అభినయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన సాయి పల్లవి ఈ చిత్రం అంతా తానై నటించారు.
ప్రేమ కథలు ఎప్పుడూ కొత్తగా ఉంటాయి ఒక్కొక్కసారి ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి ప్రేమ కథలను సరికొత్తకోణంలో ఆవిష్కరించినప్పుడు అవి ఖచ్చితంగా ప్రశంసలు పొందుతాయి. ఒకరోజు సినిమాలో కథ నాయికా నాయకుల మధ్య సాగే ప్రేమ కీలకంగా ఉంటుంది. ప్రేమ భావోద్వేగాన్ని దర్శకుడు సునీల్ పాండే .బాగా చిత్రీకరించారు సమీక్షధర్మం దృష్ట్యా పూర్తి కథనాన్ని వివరించడం లేదు. ముగ్గురి మధ్య జరిగే కథ ఇది. హిందీలో నిర్మించిన ఏక్ చిత్రానికి తెలుగు అనుసరణ. చిత్ర కథ ఇండియా నుంచి జపాన్ వెళుతుంది. సాయిపల్లవి జీవితంలో ఒక రోజు జరిగే సంఘటనలు ఒకరోజూ జ్ఞాపకాలని కోల్పోయేలా చేస్తుంది. కథా నాయకుడు తన పూర్తి స్థాయి ప్రేమను పంచుతారు. చిత్రం అంతటా హీరో హీరోయిన్లు , వారి ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమా క్లాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ముగింపు బలంగా లేదు. ఇంకా కొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. ఒక రోజు చిత్రం ప్రేమ అనుభూతిని పంచుతుంది.
— డాక్టర్ దువ్వూరి శర్మ , 9949039175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *