ఐపీఎల్ 2026 — చెన్నై అవుట్

గుజరాత్ టైటాన్స్ కి ఓపెనర్లు సుదర్శన్(84),శుభమన్ గిల్ (64),ఇంకజోస్ బట్లర్ (57 నాటవుట్ ) ధాటిగా బ్యాటింగ్ చేయడం తో జిటి ఏ దశలోనూ ఆటలో తడబడే అవసరం లేక పోయింది. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్నిఉంచారు. గుజరాత్ టైటాన్స్ ఆడిన తీరుకే చెన్నై గుండె గుభేల్ మంది. ఇది చాలదన్నట్టు గుజరాత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు ,రబాడా 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు,రషీద్ 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి నడుం విరిచారు ఏదశలోనూ కూడా చెన్నై కోలుకోవడానికి అవకాశం ఇవ్వలేదు.కేవలం 13.4 ఓవర్లలో 140 పరుగులు చేసి చెన్నై బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. ఈ మ్యాచ్ గురించి రాయాలంటే గుజరాత్ జట్టు ఆటలో బ్యాటింగ్ బౌలింగ్ విన్యాసాల గురించి రాయాలి తప్ప ఇంకేం లేదు.
నిజానికి మొదటినుంచీ చెన్నై తడబాటుగానే ఆడింది.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఏంచు కోవడం కూడా పెద్ద తప్పిదం.
ఎటువంటి పొరపాటు చేయకుండా ఆడిన గుజరాత్ గురువారం గెలుపుతో టాప్ రెండు స్థానాల్లో నిలిచింది.తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ తొలి వరుస బాట్స్మన్ సుదర్షన్ ,గిల్, బట్లర్ లు కళ్ళుచెదిరే బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చారు.
తమ వంతు బౌలింగ్ వచ్చేసరికి సిరాజ్,అద్భుతమైన స్పెల్ తో సంజు శాంసన్ ను , ఋతురాజ్ గైక్వాడ్ ను ,ఉర్విల్ పటేల్ ను పెవిలియన్ కు పంపి 230 లక్ష్యం చేరుకోనీయకుండా నిండా ముంచేశాడు.
టాస్ గెలిచిన చెన్నై గుజరాత్ ను మొదట బ్యాటింగ్ కి దింపింది.అదే చెన్నై కొంప ముంచింది.గిల్ మొదటి నుంచి జోరుమీద వున్నాడు .కేవలం 37 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు.ఇది చాలదన్నట్టు సుదర్షన్ కూడా తక్కువేం కాకుండా 53 బంతుల్లో 7 బౌండరీలు,4 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు.నేనేం తక్కువ తిన లేదు అంటూ జోస్ బట్లర్ కూడా దాడి మొదలుపెట్టి 27 బంతుల్లో 5 ఫోర్లు,4 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలబడ్డాడు. గిల్ లెగ్సైడ్ లొ ఆడిన బంతిని ఫీల్డ్ చేసిన సంజు శాంసన్ చూపుడు వేలుకి గాయం అయి ఆతని స్థానం లో ఉర్వీల్ పటేల్ ను వికెట్ కీపింగ్ కి దింపారు. చెన్నై బౌలింగ్ వెల వెల బోయింది.
బ్యాటింగ్ కి దిగిన చెన్నై ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక పోయింది.కేవలం శివం దూబే ధాటిగా ఆడి 47 పరుగులు చేసి కొంతలో కొంత నయం అనిపించు కున్నాడు.షార్ట్ కూడా 24 పరుగులు చేసి కొంత సేపు పోరాడాడు. మొత్తం మీద చెన్నై ఈ మ్యాచ్ లొ పేలవంగా ఆడి. చేచేతులా ఓటమిని మూటగట్టుకుంది.
సంజు శాంసన్ 0 పరుగులకు సిరాజు బౌలింగ్ లో బట్లర్ కి క్యాచ్ ఇచ్చాడు.షార్ట్ ఒక్కడే కొంత సేపు క్రీస్ లో నిలబడ్డాడు.24 పరుగులు చేశాడు.గైక్వాడ్ 16, ఉర్వీ పటేల్ 0 ,శర్మ 19 ,బ్రేవిస్ 8, శివం దూబే 47.
స్కోర్లు: గుజరాత్ టైటాన్స్… 20 ఓవర్లలో 4 వికెట్ల 229. ; చెన్నై సూపర్ కింగ్స్..13.4 ఓవర్లలో 140 అల్ అవుట్.


