
*** 4 వ స్థానం ఎవరిది?
ఐపీఎల్ 2026లో వింతలకు కొదువలేదు.హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో శుక్రవారం రాత్రి సన్ రైజర్స్ , రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన కీలక.మైన పోటీలో విధిగా ఎస్ ఆర్ హెచ్ గెలిచి తీరాలి లెకుంటే ఇంటికే. ఈ పోటీలో ఓడినా ఆర్ సి బి గమ్మత్తుగా టాప్ పొజిషన్ నిలబెట్టుకుని పోటీలో దర్జాగా కొనసాగుతోంది. ఇదో వింత .ముందు జరిగిన పోటీల్లో ధాటిగా ఆడి ఎక్కువ పాయింట్లను కూడబెట్టుకున్న ఆర్ సి బి 200/4 స్కోరు చేసి 18 పాయింట్లతో లీగ్ దశను ముగించుకొని +0.783 రన్ రేట్ తో తిరుగు లేని అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ కూడా 18 పాయింట్లు సాధించినా +0.695 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకుంది.ఇది గొప్ప విషయం. ఆర్ సి బి మీద 55 పరుగులతో సన్ రైజర్స్ భారీ విజయం సాధించినా లెక్కలు వేరే విషయం చెప్తున్నాయి.నిజానికి ఎస్ ఆర్ హెచ్ జట్టు బెంగుళూరును 165 పరుగుల లోపల కట్టడి చేయాల్సి వుంది. కానీ అలా జరగ లేదు.దాంతో హైదరాబాద్ జట్టు గెలిచినా +0.524 పాయింట్లతో 3వ స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
నాలుగో స్థానానికి పోటీ
3 స్థానాలు నిండి పోయాయి.ఇంకా నాలుగో స్థానానికి పోటీ ఎక్కువగా వుంది. లక్నో సూపర్ జెయింట్స్ మరియు పంజాబ్ కింగ్స్ పోటీ పడతాయి. లక్నో ఏకనా స్టేడియంలో తలపడతాయి. ఒకప్పుడు పంజాబ్ జట్టుకు మంచి అవకాశం ఉండింది. ఆరు సార్లు వరుస ఓటములను మూటగట్టుకున్న పంజాబ్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి నిలవడమో లేక పరాజయంతో వైదొలగడంతో అవుతుంది.పంజాబ్ ప్రస్తుతం 13 పాయింట్లు +0.227 నెట్ రన్ రేట్ తో 5 వ స్థానం లో వుంది.అయినా అది 4 వ స్థానానికి క్వాలిఫై కావడానికి సరిపోదు. పాయింట్ల పట్టి కలో పంజాబ్ కన్న రాజస్థాన్ రాయల్స్ మెరుగ్గా వుంది. ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడితే పంజాబ్ జట్టు ఇంటికి వెళ్లక తప్పదు. రాజస్థాన్ ఓడితే పంజాబ్ మరో చివరి పోటీ కోసం అవకాశం వస్తుంది.కోల్కతా నైట్ రైడర్స్ కి డిల్లి కేపిటాల్స్స్ కి మధ్య జరిగే పోటీలో విజేతతో 4 ప స్థానం కోసం పోటీ పడుతుంది.నాలుగో స్థానానికి ఇన్ని పీట ముడులు వున్నాయి — NRS





