గురు – శిష్యుల సంబంధం


త బుధవారం ప్రవచనంలో స్వామి త్రివిక్రమానంద గురువు- శిష్యుని మధ్య గల సంబంధాన్ని
గురించి రామకృష్ణుడు తెలియజెప్పిన విషయాలను వివరించారు. ఈ క్రమంలో శిష్యులలో గల తేడాలను బోధపరచడానికి సంతలో ఆవులను ఎంపిక చేసుకునేటప్పుడు దాని తోక పట్టుకు లాగి చూస్తారని, చైతన్యవంతమైన
ఆవు తోక పట్టుకోగానే గంతులేస్తుందని, మరికొన్ని ఆవులు నిమ్మకు నీరెత్తినట్లు కదలకుండా
ఉంటాయని తెలిపారు. అదే విధంగా నరేంద్రనాధ్ చైతన్యవంతుడని రామకృష్ణుడు పరిగణిస్తారు.
కొందరు చురుకుదనం లేకుండా నిస్తేజంగా ఉంటారు. పాలల్లో వేసిన అటుకుల వలె ఉంటారు.
మహేంద్రనాధ్ అలాంటి వాడని ఆయన భావన. అందుకే ఒకసారి నరేంద్రునితో మాట్లాడమని
మహేంద్రనాధ్ కు చెప్తాడు. వివేకానందుని వలె రామకృష్ణుడు కూడా మంచి గాయకుడు. ఇతర కళల్లో
కూడా ఆయనకు ప్రవేశం ఉంది. ధ్వన్యనుకరణ, మట్టితో బొమ్మలు చేయడం వంటివి రామకృష్ణునికి తెలుసు.
శిష్యులతో మాట్లాడే సమయంలో రామకృష్ణుడు కర్ణపేయంగా ఉండే రెండు పాటలు పాడతారు. అందుకే
ఆయనపట్ల మహేంద్రనాధ్ గుప్తా ఆకర్షితుడవుతాడు. ప్రతి ఒక్కరూ అందరినీ ఒకే రీతిలో ప్రేమించాలని
నిస్వార్ధంగా వ్యవహరించినప్పుడే అది సాధ్యమని శారదాదేవి చెప్తారు. ఎవరినుంచి ఏమి ఆశించప్పుడే అది సాధ్యమని చెప్తుంది. దైవం పట్ల విశ్వాస – వైరాగ్యాలు ఉంటాయి. ఇష్ట – నిష్ఠ అవసరమని అని చెప్తాడు. అదే సమయంలో రామకృష్ణుడు మధ్య మధ్యలో శిష్యులను తన గురించి ప్రశ్నిస్తాడు. అదే విషయాన్నీ మహేంద్రనాధ్ గుప్తాను కూడా ప్రశ్నిస్తాడు. శిష్యులు తనను ఏ మేరకు అర్ధం చేసుకుంటున్నారనే విషయాన్ని
తెలుసుకోవడానికి రామకృష్ణుడు అలా ప్రశ్నించేవారు. ఆ విధంగా వారి మధ్య బలపడిన బంధం
ఉత్తరోత్తరా మహేంద్రనాధ్ గుప్తా శ్రీ రామకృష్ణ కథామృత సారాన్ని రెండు సంపుటాలుగా ప్రచురించడానికి
దారితీసింది.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *