
శ్రీనివాస మంగాపురం పేరు వినగానే తిరుపతికి సమీపంలో పుణ్యక్షేత్రం గుర్తుకువస్తుంది. యువతరం కథానాయకులను వెండితెరకు పరిచయం చేసిన సి. అశ్విని దత్ ఇప్పుడు మహేష్ బాబు సోదరుడి తనయుడు జయకృష్ణను ఈ సినిమా ద్వారా అరంగేట్రం చేయించారు ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా సంచలనం సృష్టించిన యువ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు కథానాయకుడు శ్రీనివాస్ కథానాయిక మంగ పేర్లను కలిపి శ్రీనివాస మంగాపురంగా నామకరణం చేశారు చిత్రకథ వర్తమానం నుంచి గతానికి వెళుతుంది. దర్శకుడు కథనాన్ని నవ్యతపరంగా చిత్రీకరించారు. సమీక్షలో చిత్రకథని చదవడం కన్నా వెండి తెరమీద చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. అందరికీ తెలిసిన ప్రేమకథను సరికొత్తగా ముస్తాబు చేసి ప్రేక్షకులకు అందించారు.
చిత్రంలో మొదటగా ప్రస్తావించవలసింది నూతన కథానాయకుడు జయకృష్ణ అభినయం గురించి . నటనలో శిక్షణ పొందిన జయకృష్ణ అందరి అభినందనలు అందుకునే స్థాయిలో నటించారు . డ్యాన్స్, పోరాటాలలో బాగా పరిణతి కనబడింది. ప్రేమ సన్నివేశాల్లో , భావోద్వేగ దృశ్యాలను ఇంకా నటన కనపరచవలసింది. ఒక్కప్పటి మహేష్ బాబు ప్రేక్షకులకు గుర్తుకువస్తారు. చిత్రం యాక్షన్ దృశ్యాలతో ప్రారంభమైంది. రవీనా టాండన్ కూతురు రశా తడాని గ్లామరస్ గా మెరిశారు. చిత్ర కాథానాయకుడి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని వర్ధమాన తారలను ఎంపిక చేశారు. పాటలు అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి. ఈ చిత్రంలో నారాయణప్పగా వడ్లమాని సాయి శ్రీనివాస్ కనిపించారు. విశ్రాంతి తరువాత కథ మలుపులు తిరుగుతుంది. మోహన్ బాబు కీలకపాత్రలో నటించారు. చిత్రం చాలావరకు తిరుపతి పట్టణంలో చిత్రీకరించారు. తెలుగునాట తిరుపతి అందరికీ పుణ్యక్షేత్రంగా పరిచయం. ఇది తెరమీద చూసినప్పుడు పారవశ్యం కలుగుతుంది. జయకృష్ణ ప్రేమకథా చిత్రాలకు సరిగ్గా సరిపోతారు. చిత్ర బృందానికి ప్రేమాభినందనాలు.
--డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ , 99490 39175




