శ్రీ భావనఋషి సంఘం ఎన్నికలలో శక్తి గ్రూప్ గెలుపు

కాప్రా, హైదరాబాద్: కాప్రా సర్కిల్ లోని పద్మశాలి టౌన్షిప్ శ్రీ భావనఋషి వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గానికి (2026–2028) ఆదివారం ప్రజాస్వామ్య పద్ధతిలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఫలితాలను ఎన్నికల అధికారి శ్రీ ఎం.ఎస్. చారి అధికారికంగా ప్రకటించారు.ఎన్నికల్లో సంఘం సభ్యులు అత్యధిక ఉత్సాహంతో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలలో శ్రీమతి యేముల దీప నేతృత్యంలోని శక్తి గ్రూప్ అత్యధిక మెజారిటీతో గెలిచింది. ప్యానెల్ లోని సభ్యులందరూ గెలుపొందడం విశేషం. కొత్త కార్యవర్గం బుధవారం ఉదయం పదవీస్వీకార ప్రమాణం చేసే అవకాశం ఉంది.

అధ్యక్షులు : దీప యేముల – 287 ఓట్లు (మెజారిటీ 97)
ఉపాధ్యక్షుడు: బి. సదానందం – 266 ఓట్లు (మెజారిటీ 65)
ప్రధాన కార్యదర్శి: బోగ వెంకటేశ్ – 283 ఓట్లు (మెజారిటీ 98)
కోశాధికారి: జయకర్ దర్గా – 260 ఓట్లు (మెజారిటీ 67)
సంయుక్త కార్యదర్శి: నరసింహులు కోల – 254 ఓట్లు (మెజారిటీ 51)

కార్యవర్గ సభ్యులుగా శక్తి గ్రూప్ ప్యానెల్ నుంచి యన్ రమాదేవి 248 , మేదరి సుభాష్ 240 , గండ్ల విజయ కుమర్ 270 , సందీప్ జడల 261 ఓట్లతో గెలుపొందారు. కొత్త కార్యవర్గం సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, పారదర్శక పాలన మరియు పద్మశాలి టౌన్‌షిప్ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించిన ఎన్నికల అధికారి శ్రీ ఎం.ఎస్. చారికి , ఎన్నికల కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద సేవకులకు , ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన ప్రతి సభ్యునికి కార్యవర్గ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కార్యవర్గానికి సభ్యులందరూ సహకరించి, టౌన్ షిప్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *