
సైనికపురి సాయిబాబా ఆఫీసర్ కాలనీలో శ్రీ రామకృష్ణ కథామృత సారంపై స్వామీజీ త్రివిక్రమానంద
ఉపన్యాస పరంపర నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రతి బుధవారం చొప్పున
ఏడు ప్రవచనాలు జరిగేయి. కొందరు స్వయంగా వచ్చి ప్రవచనాన్ని చాలామంది
వింటుండగా ఎక్కువమంది ఆన్ లైన్ లో విని తెలుసుకుంటున్నారు. శ్రీ రామకృష్ణులవారు వివిధ
అంశాలను గురించి ఎరుకపరిచే క్రమంలో ఆసక్తి కలిగించే చిన్న చిన్న కథలను వినిపించే వారని,
అదేవిధంగా శిష్యులతో మాట్లాడే సమయంలో కర్ణపేయంగా ఉండే పాటలు పడతారని స్వామీజీ
వెల్లడించారు. శిష్యులు తనను ఏ మేరకు అర్ధం చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు
రామకృషుడు మధ్య మధ్యలో తన గురించి ప్రశ్నించేవాడని కూడా ఆయన తెలిపారు. ఆ విధంగా
మహేంద్రనాథ్ గుప్తాకు రామకృష్ణుడికి మధ్య సంబంధం బలపడింది. ఆ బంధమే ఉత్తరోత్తరా శ్రీ రామకృష్ణ
కథామృత సారాన్ని రెండు సంపుటాలుగా ప్రచురించడానికి దారితీసింది. ప్రేమ ద్వారానే
భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు నని , ప్రతి ఒక్కరూ అందరినీ ఒకే రీతిలో ప్రేమించాలని ,
నిస్వార్ధంగా వ్యవహరించినప్పుడే అది సాధ్యమని శారదాదేవి చెప్తారు. శ్రీ రామకృష్ణుడు ఆమెను
ఒక మాతగా గౌరవిస్తారు. ప్రేమలో కూడా ఇష్ట - నిష్ఠ అవసరమని రామకృష్ణుడు కథామృత సారంలో
చెప్తారు. ప్రతి ఒక్కరిలో నారాయణుడుంటాడని దొంగలో, పోలీసుల్లో కూడా నారాయణుడుంటాడని
ఆయన చెప్తారు. భగవంతునిపైన భక్తికి విశ్వాసం ముఖ్యమని రామ నామముపై ఉన్న విశ్వసమే
ఆంజనేయుడు లంఘించి సముద్రం అవలీలగా దాటేందుకు తోడ్పడింది. నిష్కామకర్మవల్ల
భగవత్ దర్శనం జరుగుతుంది. జీవులకు చేసే సేవ శివరారాధనకు దారితీస్తుందని రామకృష్ణుడు
తెలిపారు. చిత్తశుద్ధి ఉంటేనే ప్రేమ జనిస్తుందని రామకృషుడు అన్నారు. మంచి మార్గంలో నడవాల్సిందిగా
మనకు తెలిసినవారికి ఎన్నిసారు చెప్పినా విననప్పుడు వారు మంచి నడవడిక అలవర్చుకునేలా
చూడాలని భగవంతుణ్ణి ప్రార్ధించాలని ఆయన అంటారు. తదుపరి ప్రవచనం వచ్చే బుధవారం
ఆగస్టు 19న సాయంత్రం ఆరు గంటలకు ఉంటుంది. ఆసక్తిగలవారు సాయిబాబా ఆఫీసర్స్ కాలనీలోని
184/ఏ ఇంటిలో స్వయంగా స్వామీజీ త్రివిక్రమానంద ఉపన్యాసం/ప్రవచనం వినవచ్చు.




