ఈ వారం పుస్తకం

వృత్తిరీత్యా అధ్యాపకురాలైన శ్రీమతి పోచం సుజాత గత మే నెలలో ప్రచురించిన
‘సకల దేవతా భక్తి గీతాలు’ పుస్తకం భజన బృందాలకు, పారాయణాలు చేసే మహిళా బృందాలకు అనువైనది. బృందగానాలు చేసుకునేందుకు వీలైన అద్భుతమైన పుస్తకం ఇది. తన కుటుంబ సభ్యులతో కలసి ఎన్నో
పుణ్యక్షేత్రాలు సందర్శించిన సుజాత భక్తి గీతాలను
ఆర్ధ్రతతో రాశారు. ఇందులో భక్తి గీతాలు ఆమెలో భక్తి తత్వాన్ని వినిపించాయి. గణపతి గీతాలతో
మొదలైన ఈ పుస్తకంలో పల్లె ప్రజల ఆరాధ్య దేవత ‘ఎల్లమ్మ’ , వనదేవతల సమ్మక్క, సారక్కలను మరువలేదు.
స్తుతి, ప్రార్ధన, ఉపాసన సృష్టికర్త పరమాత్మకే చెందుతాయి.
చారిత్రక పురుషులైనా రామ,కృష్ణులను గురించి రచయిత్రి అద్భుతమైన కీర్తనలు రాశారు.
తన ఇష్ట దైవమైన శ్రీరాముని కథను ఉయ్యాలపాటగా సంక్షిప్త రామాయణంలో అందించారు.
ఇందులో మంగళ హారతులు, నీరాజనాలు ఉన్నాయి. పాటలోనే నా ప్రాణంబు
కాలాడాడు అని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె గారు. గీతాలు చదువుకోవడానికే
కాదు పడుకోవడానికి అలవోకగా ఉండాలి. అది సాధించారు సుజాత. రచయిత్రి
దేవతలను స్తుతించడంతో పాటు సమాజంలో జరుగుతున్నా అకృత్యాలు ,
అమానవీయ సంఘటనలను గురించి తన అవేదనను నివేదించుకున్నారు. భక్తులందరిలోనూ
మనకు ఈ లక్షణం కనిపిస్తుంది. అష్టాదశ పీఠాలను, గోవిందుణ్ణి, సాయిబాబాను
ఎవరినీ మరువకుండా అందరినీ కీర్తించారు.
–ఆర్ హెచ్.







