
=====
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికినీ ఇంకా అభిమానతారగా సినీ అభిమానులు ఆరాధిస్తున్నారు. సినీనటుడుగా పరిమిత సంఖ్యలో చిత్రాలలో నటించినా యువప్రేక్షకులు తమ ఆరాధ్య కథానాయకుడిగా భావిస్తారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి ఇటీవల విడుదలైన ఓజీ వరకు పవన్ చిత్రాలు యువతరాన్ని బాగా ప్రభావితం చేశాయి. వాటిలో ప్రేమ, రౌద్రం, హాస్యం, విషాదాల భావోద్వేగాలు నిండి ఉన్నాయి పవన్ చిత్రాలలో సామాజిక అంశాలు, చైతన్యవంతమైన అంశాలు తెరమీద బాగా పండాయి. తమ్ముడు , సుస్వాగతం, బంగారం, తొలిప్రేమ, ఖుషి, జానీ చిత్రాలు ప్రేమ కథలైనా వాటిలో బలమైన భావోద్వేగాలు కుటుంబ పరమైన అంశాలు దాగి ఉన్నాయి. సుస్వాగతం చిత్రంలో కేవలం ప్రేమ పరమైన విషయాలే కాకుండా తండ్రి కొడుకులు మధ్య సున్నితమైన అంశాలు మనసుకి బాగా చేరాయి బంగారం తమ్ముడు చిత్రాల్లో సోదరీ సోదరుల మధ్య అనుబంధాలు అందరికీ విపరీతంగా నచ్చాయి. ఖుషీ చిత్రంలో నిజమైన ప్రేమికుడుగా సరదా సరదాగా పవన్ భూమిక మధ్య దృశ్యాలు బాగా మురిపించాయి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. పవన్ కళ్యాణ్ లో సహజంగా ఆదర్శాలు నీతి నిజాయితీ భావనలు ఉంటాయి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శక రచయితలు ఆయన పాత్రల్ని తీర్చిదిద్దారు. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో రాజకీయాల్లో ఉన్న అవకాశవాదం గురించి సంభాషణలు బలంగా ప్రేక్షకుల్ని సృజించాయి. పవన్ కళ్యాణ్ దర్శకులను బాగా నమ్మడం విశేషం. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం తెరమీద బాగా కనపడింది. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాలు ప్రపంచమంతటా విపరీతంగా ఆదరణ పొందాయి పవన్ చిత్రాలు కుటుంబ విలువలు రంగరించిన కొత్త కథనాలతో ఉంటాయి. పవన్ పోలీసు అధికారి గబ్బర్ సింగ్ గా హుషారుగా నటించినా అక్కడ తల్లి కొడుకుల అనుబంధాన్ని పండించారు. అన్నవరం చిత్రంలో సోదరీ సోదరుల మధ్య మమతానురాగాలు, ప్రాంతీయ సంఘర్షణలు ఇలా కథ నిండా కనిపించాయి. బంగారం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు సున్నితమైన భావోద్వేగమైన అంశాలని ప్రాంతీయవాదం రాజకీయ స్వార్ధ విషయాలని నిజాయితీగా తెరమీద నడిపించారు పవన్ చిత్రాలలో పాటలు బాగా జనాదరణ పొందాయి. దేవిశ్రీ ప్రసాద్, తమన్, మణిశర్మ సంగీత దర్శకులుగా అందించిన మంచి రాగాలకి పవన్ అభినయం ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది. హరికరమల్లు , గోపాల గోపాల చిత్రాలలో పాత్రలు ప్రేక్షకులలో ఆసక్తి జనింపజేశాయి. కొన్ని చిత్రాలు అంతగా విజయం సాధించకపోయినా ఆయన అనుసరించే శైలి, ఒరవడి కొత్తగా అనిపించాయి. పవన్ దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశఉపముఖ్యమంత్రిగా కృషి చేస్తున్నారు. సమయం లభించినప్పుడు పవన్ చిత్రాలలో నటిస్తున్నారు. పవన్ తన పాత్రల ద్వారా ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచాడు. పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు
-- డాక్టర్ దువ్వూరి శర్మ , సినీ పరిశోధకులు, 99490 39175









