ఆచార్య దేవోభవ

   ప్రతి ఒక్కరికి సెప్టెంబర్ 5 అనగానే ఉపాధ్యాయ దినోత్సవం గుర్తుకు వస్తుంది. అందరికీ ఆదర్శ గురువు అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం . అమ్మానాన్నల  తర్వాత గురువు పాత్ర కీలకం.   అక్షరాలను మనకు నేర్పి,  జ్ఞానం మీకు నడిపించి ఆత్మ స్థ యిర్యంతో చరించే శక్తి ప్రతి ఒక్కరికి గురువు అందిస్తారు.  ప్రాథమిక పాఠశాల నుంచి  పరిశోధక విద్యార్థి స్థాయి వరకు నేర్చుకున్న జ్ఞానం  ఎవరికైనా గురువు ద్వారా లభిస్తుంది. .  ఒక విధంగా ఉపాధ్యాయుడు కాంతిపుంజమై జ్ఞానం వెలుగుల్ని సమర్పిస్తారు.  ఎవరకు ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా వారి జీవిత పునాదికి గురువు పాత్ర  నేపథ్యం చిరస్మరణీయంగా  ఉంటుంది .  మహనీయుల జీవనంలో గురువుల పాత్ర ప్రశంసనీయం.   సమాజంలో అన్ని వృత్తుల వారు  రాణించేందుకు తోడ్పడే  గురువు పాత్ర గొప్పది.  వాల్మీకి వ్యాసుడు ద్రోణుడు అవతార పురుషుల్ని గొప్పవారిగా తీర్చిదిద్దారు.  తరాలు మారుతున్న కొద్దీ గురువు పాత్ర మారింది. విలువలు కూడా మారడం విశేషం.   బ్రిటన్ కాలనీ నుంచి విద్యా విధానం కొత్తగా అవతరించింది ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా శ్రమించినా  అధిక విద్యార్హతలు కలిగి ఉన్నా  తక్కువ జీతాలు , ఉద్యోగ భద్రత లేకపోవడం పెన్షన్ సౌకర్యం లేకపోవడం విచారకరం .  ఈ పరిస్థితి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉంది ప్రైవేట్ రంగంలో గురువులు జీవనం సమస్యల వలయంలో ఉంది ఉపాధ్యాయుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా  కేవలం తన బోధన ద్వారా అంతులేని ఆనందాన్ని ఆస్వాదిస్తాడు.  తనకంటే  తన శిష్యులు మంచి స్థితిలోకి వెళ్లాలని కోరుకుంటాడు.  ఆధునిక కాలంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా పనిచేసిన తిరిగి తన బోధనావృత్తికి వెళ్లడం గమనార్హం.  
గురువు పాత్ర వైద్యుడు న్యాయవాది రాజకీయ నాయకుడు ఇలా అందరినీ ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది. గురుపూజ దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు

–డాక్టర్ దువ్వూరి శర్మ , అధ్యాపకులు , 99490 39175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *