
వివిధ జోనర్లలో సినిమాలు వస్తున్నప్పటికీ యువతను ఎక్కువగా ఆకర్షించేవి ప్రేమ కథాంశం ఉన్నచిత్రాలే.
ప్రేమ కథలు ఎప్పుడు తెరమీద చూసిన కొత్తగా అనుభూతిని పంచుతాయి. యువప్రేక్షకులు ప్రేమ చిత్రాల పారవశ్యంలో తమల్ని తాము సందర్శించుకోవడం విశేషం. దేవదాసు నుంచి బేబీ వరకు ప్రేమ కథల పుస్తకాలు ఎప్పుడు చదివినా ఆసక్తిగా ఉంటాయి. బేబీ చిత్రం ద్వారా ఆదరణ పొందిన ఆనంద్, వైష్ణవి మరలా ఎపిక్ చిత్రంలో జంటగా ప్రేక్షకులని అలంకరించారు. చిత్రం మొత్తం అంతా ఆదిత్య, కడలి పాత్రల మధ్య 90% ఉంటుంది. బేబీ చిత్రంలో అమ్మాయిల అంతరంగాలని ఆవిష్కరించినా , ఈ సినిమాలో స్నేహం సహజీవనం జతగా కుటుంబ బాధ్యతలు అనుబంధాలు భావోద్వేగాల దృశ్యాలు తెరమీద నడిచాయి. ప్రథమార్ధం అంతా సరదా సరదాగా నడుస్తుంది. తర్వాత సహజీవనం పెళ్లి కుటుంబ పరమైన అంశాలు జీవితంలో స్థిరపడే విషయం వీటి పైన దర్శకుడు ఆదిత్య హాసన్ ఆలోచనలు తెరమీద మనసుని బాగా స్పృశించాయి. చిత్రంలో ఆనంద్ - వైష్ణవిల కెమిస్ట్రీ బాగా పండింది వైష్ణవి పరిణతి గల అభినయం ఆనంద్ అమాయకత్వం అందరికీ నచ్చాయి . అబ్దుల్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ పాటలు బాగున్నాయి సినిమా అంతా లండన్ అందాలను అందించింది. చిత్రం అంతా ప్రేమ వేదన భావోద్వేగాలు కనపడతాయి. చిత్రం నగర ప్రేక్షకులకి, యువప్రేక్షకులకు ఖ చ్చితంగా నచ్చుతుంది ఈ వారం ఐదు సినిమాలు వివిధ రకాల జోనర్లలో వచ్చాయి. కానీ ఎపిక్ సెమిస్టర్ చిత్రం కళాశాల విద్యార్థులను థియేటర్లకు రప్పిస్తుంది. ప్రేమ భావోద్వేగాల ఎపిక్ సెమిస్టర్-2 ఉందని ముగింపు సూత్రప్రాయంగా చెప్పింది.
–— డాక్టర్ దువ్వూరి శర్మ,సినీ పరిశోధకులు, , 99490 39175





