మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణ

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రాహాలకే పూజలు చేయాలని ధర్మో రక్షతి, రక్షిత పౌండేషన్ ఉపాధ్యక్షులు సంఘిశెట్టి సత్యానారాయణ అన్నారు. ఆదివారం ఈసిఐఎల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న భవాని ప్లాజా వద్ద ఎన్ ఆర్ ఐ శ్రీపాల్ రెడ్డి తో కలసి మట్టి వినాయక విగ్రహాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా సత్యానారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహలను పంపిణి చేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం ప్లాస్టర్ అఫ్ ప్యారిస్ తో చేసే విగ్రహల నుంచి వెలువడే రసాయానలతో ఎంతో ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. కాల్యుష్యాన్ని తగ్గించేందుకు మట్టి విగ్రహాలను పంపిణి చేస్తున్నామని అందరూ మట్టి విగ్రాహాలను పెట్టి పూజలు చేయాలని కోరారు. ఈర్యక్రమంలో రాజు, స్వయం సేవక్ శివశంకర్, కుర్రా దుర్గారావు, అమరేందర్ రెడ్డి,మేఘనా రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *