మాధవపురి గణపతి బప్పా మోరియా

        కాప్రా సర్కిల్ లోని మాధవపురి కాలనీ నివాసులు ముఖ్యంగా మహిళలు,యువత వినాయక చవితి ఉత్సవాలలో 
ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీరామ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి . విగ్రహం ఏర్పాటు నుంచి నిమజ్జనం, అన్నదానం వరకు అన్నింటికీ అయ్యే ఆర్ధిక భారాన్ని కాలనీవాసులు భరిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో కాలనీకి చెందిన గృహస్తు దంపతులు రోజుకు రెండు మూడు జంటల చొప్పున పూజలు జరుపుతున్నారు. ఉత్సవాల కోసం మాధవపురి కాలనీలో అన్ని వీధులను కాషాయ జెండాలతో అలంకరించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు జరుగుతున్నాయి పూజలను వేదమూర్తులు శ్రీమాన్ మోటుపల్లి రామానుజాచార్య నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 200 మంది మంటపానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు శ్రీరామ వినాయక ఉత్సవ కమిటీతోపాటు మాధవపురి సంక్షేమ సంఘం కార్యదర్శి గిరీష్, ఉపాధ్యక్షులు మూర్తి ఇతర కార్యవర్గ సభ్యులు పూజా కార్యక్రమాల నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. ముఖ్యంగా కాలనీ మహిళా బృందం సభ్యులు బుధవారం జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. బుధవారం దాదాపు ఐదు వందల మంది
అన్న ప్రసాదం స్వీకరించారు. కాగా గురువారం విద్యార్థులకు, వృద్ధులకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని దుప్పట్లు పంపిణీ చేయాలనీ తలపెట్టింది. శ్రీరామ వినాయక ఉత్సవ కమిటీ ఈ సంవత్సరం వినూత్న రీతిలో స్వామి చేతిలో ఉంచిన లడ్డును వేలం వేయకుండా నిర్ణీత టికెట్ సొమ్ము చెల్లించి టికెట్ కొనుక్కున్న వారిలో లక్కీ విజేతకు లడ్డు బహూకరించాలని నిర్ణయించింది. లడ్డు టికెట్ల లాటరీ
ఆదివారం జరుగుతుంది. అదే రోజు యువత ఉట్టి కొట్టడం, రాంపల్లి చెరువులో వినాయక నిమజ్జనం ఉంటాయని మేనేజిమెంట్ కమిటీ తరపున చైర్మన్ రవి సీతారాం తెలిపారు.

Madhavapuri Ganapati Bappa Moriya

        The residents of Madhavapuri Colony in Kapra Circle, especially women and youth, are enthusiastically participating in the Vinayaka Chavithi celebrations. The Vinayaka Utsava is being held grandly under the auspices of the Sri Rama Vinayaka Utsava Committee, which has been organizing programs in the colony for the past few years. The residents of the colony are bearing the financial burden of everything from the installation of the idol to immersion and distribution of food. During these week-long festivals, household couples from the colony perform pujas in two or three pairs per day. All the streets in Madhavapuri Colony have been decorated with saffron flags for the festival. Poojas are performed every morning and evening. The pujas are conducted by Purohit  Sriman Motupalli Ramanujacharya. Every day, about 200 people come to the mandapam to have darshan of the Lord and receive the Prasad.  Along with the Sri Rama Vinayaka Utsav Committee, Madhavapuri Welfare Association Secretary Girish, Vice President Murthy and other executive members are participating in the organization of the puja programs. Especially the members of the colony women's group actively participated in the Annadanam programs held on Wednesday and distributed prasadam to the devotees. Around five hundred people received Anna Prasadam on Wednesday. Meanwhile, the committee has decided to distribute blankets to students and the elderly on Thursday, keeping the winter season in mind.  The Sri Rama Vinayaka Utsav Committee has decided to give away the LADDU held by the Lord in an innovative way this year, instead of auctioning it, it will be given  to the lucky winner among those who bought the ticket by paying the fixed ticket price. The lottery of the laddu tickets will be held on Sunday. On the same day, there will be a Celebration of UTTI (ఉట్టి) and Vinayaka immersion in the Rampalli tank, said Chairman Ravi Seetharam on behalf of the Management Committee.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *