బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.

సమస్త ఆధ్యాత్మిక ప్రపంచం విశేషంగా ఆరాధించేది శ్రీనివాసుడినే.   సంపన్నుడైన సామాన్యుడైన వెంకటేశ్వరుని స్మరించినప్పుడు హృదయం తిరుమల గా మారుతుంది.  తెలుగువారందరూ  మాత్రమే కాకుండా  ప్రపంచమంతా  నివసించే  ప్రవాస భారతీయులు కనీసం ఏడాదికి ఒకసారైనా స్వామి సందర్శనం కోసం పరితపిస్తారు.  నిత్యం తిరుమల గిరులు  గోవింద నామాలతో పులకరించడం పరవశించడం అందరికీ పరిచయం ప్రకృతిలో సంభవించే మార్పులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సప్తగిరులను అధిరోహించి క్షణకాలం సమ్మోహనరూపాన్ని వీక్షించి ఆ జ్ఞాపకాన్ని మనసు తెరపై తన్మయత్వంగా దాచుకొని మరల ఆ అనుభూతికై నిరీక్షించడం సహజం. వెంకటేశ్వరుని వైభవం యుగయుగాలుగా రోజురోజుకి పెరగగం మనకు విదితమే. ఆశ్వీయుజ మాసంలో అమ్మవారి దేవీ నవరాత్రులు శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు ఒకేసారి వస్తాయి. అయితే ఈసారి అధికమాసం కావడం వలన రెండు పర్యాయలు వచ్చాయి ఇది ఆధ్యాత్మిక అంతరంగాలకు ఆనందాన్నిస్తోంది. శుభకార్యం ఎవరికైనా మంచి జ్ఞాపకం. ప్రపంచాన్ని తనదైన శైలిలో సృష్టించే విధాత బ్రహ్మ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలు కావునా బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ ఉత్సవ సమయంలో శ్రీవారిని కొలిచినప్పుడు అనుగ్రహం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన వస్త్రాలు సమర్పించారు. హనుమంతు వాహనం సూర్యప్రభ చంద్రప్రభ ఇలా అన్నీ స్వామివారి సేవలో తరిస్తాయి. గరుడసేవ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు వస్తారు బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల తిరుపతి అందంగా ముస్తాబవుతున్నది. దేవాలయాలన్నింటినీ పూలతో అలంకరిస్తారు.అక్కడి పరిసరాలు మనసునే స్పృశిస్తాయి . దేవస్థానం సిబ్బంది కనీసం రెండు నెలల పరిశ్రమించి విజయవంతం కావడానికి పరిశ్రమించడం విశేషం. తెలుగు రాష్టాల నుంచే కాకుండా ప్రపంచమంతటా ఉండే భక్తజనం ఉత్సవాలకు రావాలని ఆకాంక్షిస్తుంది. ఈ ఉత్సవాలకు రావాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉన్నా పని దినాలు కావడం వల్ల సాధ్యం కాక ఆగిపోతారు. వారికోసం అన్ని భక్తి చానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటాయి. మరల దసరా సెలవుల్లో వచ్చే రెండో బ్రహ్మోత్సవానికి అధిక సంఖ్యలో హాజరవుతారని అంచనా ఉంది. అదే సమయంలో నూతన సంవత్సర క్యాలెండర్లు, పంచాంగాలు విడుదలవుతాయి  శ్రీనివాసుడి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ఆకాంక్షిస్తూ బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

— డాక్టర్ దువ్వూరి శర్మ , అధ్యాపకులు , 99490 39175 .

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *